Devara: దేవర నుండి ఆ హీరోయిన్ అవుట్.. కొంప ముంచేసిందిగా..?

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . మూడో షెడ్యూల్ కూడా గోవాలో ఘనంగా ప్రారంభం కావడానికి రెడీగా ఉంది. అయితే చిన్నపాటి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో వెకేషన్ కి ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో యమ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

లేటెస్ట్గా సినిమాకి (Devara) సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినీ వర్గాలలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో మొదట హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. రెండో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని ఈ సినిమాకి ఓకే చేసుకున్నాడు కొరటాల శివ అంటూ న్యూస్ వైరల్ అయింది . అయితే తాజా గా అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది .

దానికి మెయిన్ రీజన్ అమ్మడు ఖాతాలో మరో బాలీవుడ్ బంపర్ ఆఫర్ రావడమే . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ చేసిన పెద్దగా వాల్యూ ఉండదని ..అదే హిందీ సినిమాలో మెయిన్ లీడ్ కావడంతో ఆమె క్రేజ్ డబుల్ అవుతుందని .. అందుకే ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాది కొరటాల శివ ఇంకా ఈ సినిమాలో ఆమెను ఫైనల్ చేయలేదని..

నువ్వే ఫిక్స్ అంటూ చెప్పాడు కానీ ఎక్కడ అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించలేదని ..దీంతో ఈ సినిమాల్లో ఈ పాత్ర దక్కుతుందా లేదా అని అనుమానం కలిగిన మృణాల్ కొరటాల శివకు హాండ్ ఇచ్చి మరి ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వైరల్ అవుతుంది . దీంతో సోషల్ మీడియాలో దేవర సినిమా నుంచి మృణాల్ తప్పుకుంది అన్న న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus