‘సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. చాలా మంది ఇక్కడ ఉండే ఆడవాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు. అందుకు సపోర్ట్ చేసిన వాళ్ళకే అవకాశాలు ఇస్తారు. లేదు అంటే అవకాశాలు లేకుండా చేస్తారు’ అంటూ ఇప్పటివరకు చాలా మంది నటీమణులు మీడియా, సోషల్ మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పలేదు. ఇలాంటి కేటగిరిలోకి మరో హీరోయిన్ చేసింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ తార మల్లికా షెరావత్.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “అప్పట్లో చాలా మంది హీరోలు నన్ను రాత్రికి రమ్మని ఫోన్లు చేసేవారు. కుదరదు అని చెప్పినా మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేస్తూనే వచ్చేవారు. రాత్రి ఒంటరిగా వచ్చి కలవమని పరోక్షంగా చెబుతూ ఉండేవారు. నేను రాత్రి సమయంలోనే ఎందుకు వచ్చి కలవాలి అని నేను అడిగేదాన్ని. సినిమాల్లో బోల్డ్ గా నటిస్తాను. ‘అయినంత మాత్రానా నేను హీరోలు చెబితే వింటాను అని ఎలా అనుకుంటారు..?’ అని ప్రశ్నించేదాన్ని.
వాళ్ళ కాల్స్ వల్ల చాలా ఇబ్బంది పడేదాన్ని. పెద్ద హీరోల దగ్గర కూడా అలాగే ఉండేదాన్ని. దాంతో నా కోపం పెంచుకుని.. వాళ్ళ పలుకుబడి వాడి నన్ను కొన్ని సినిమాల్లో నుండి తప్పించేలా చేశారు. తర్వాత అవకాశాలు బాగా తగ్గాయి. అయినా సరే నేను ఆ టైపు కాదు. వెండితెరపై బెడ్ రూమ్ సీన్స్ లో నటించాను. కానీ హీరోల ఆలోచనలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలీదు” అంటూ మలైకా షెరావత్ షాకింగ్ కామెంట్స్ చేసింది.