ఆ డైరెక్టర్ నాపై చేయి చేసుకున్నాడు.. స్టార్ హీరోయిన్ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

కమర్షియాలిటీకి దూరంగా ఉండి సినిమాలు చేసే దర్శకులు కొంతమందే ఉంటారు. వాళ్లలో బాల ఒకడు అని చెప్పాలి. ‘శివపుత్రుడు’, ‘నేను దేవుడ్ని’, ‘వాడు వీడు’ (Avan Ivan) వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు ఇతను. ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అందుకోవడం మాత్రమే కాకుండా క్రిటిక్స్ ను కూడా మెప్పించాడు. ‘బాల..తో కనుక సినిమా చేస్తే, నటీనటులకు నేషనల్ అవార్డులు రావడం గ్యారెంటీ’ అనే నమ్మకం కూడా చాలా మందికి ఉంది.

Mamitha Baiju

ఇప్పుడు అతని హవా తగ్గినా. అతని సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి కాబట్టి.. అంతా బాల (Bala) గురించి గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న దర్శకుడి గురించి మొన్నామధ్య ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. విషయం ఏంటంటే .. దర్శకుడు బాల ఓ నటిపై చెయ్యి చేసుకున్నాడట. ఆమె మరెవరో కాదు మలయాళ స్టార్ హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju).

ఒకానొక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. ‘ప్రేమలు’ (Premalu)   తో తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా ఎదిగిన మామితా బైజు పై బాల చేయి చేసుకున్నాడట. సూర్య ‘వానంగాన్’ సినిమాలో మమితా నటించాల్సి ఉందట. కానీ ఈ కారణం వల్లే తప్పుకున్నట్టు ఆమె తెలిపింది. ఆ సినిమా సెట్స్ లో బాల కారణం లేకుండా తరచూ తిడుతూ ఉండేవాడట.

ఓసారి చేయి చేసుకున్నట్టు కూడా ఆమె రివీల్ చేసింది. ఇది సూర్యకి తెలిసినా కూడా అతను చూస్తూ ఉండిపోయాడు అని ఆమె చెప్పి షాకిచ్చింది. అయితే కొద్దిరోజుల తర్వాత బాల.. ‘నేను ఆమెపై చేయి చేసుకోలేదు. మందలించడానికి చేయి ఎత్తాను కానీ ఆమెను కొట్టలేదు’ అంటూ వివరణ ఇచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్ తో గట్టెక్కేసిన ప్లాప్ సినిమా అది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus