సల్మాన్ ఖాన్ నటించిన ‘రెడీ’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి కుబ్రా సైత్. ఆ తరువాత ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ‘సుల్తాన్’, ‘జవానీ జానెమన్’, ‘సినీ ఆఫ్ లైఫ్’ వంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ బ్యూటీ ‘ఓపెన్ బుక్: నాట్ ఏ క్వైట్ మెమోయిర్’ అనే పుస్తకాన్ని రాసింది. జూన్ 27న విడుదలైన ఈ బుక్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చాలా విషయాలను పొందుపరిచినట్లు చెప్పింది.
బాడీ షేమింగ్, వన్ నైట్ స్టాండ్, అబార్షన్, లైంగిక వేధింపులు వంటి తదితర విషయాలను గుర్తుచేసుకుంది. ముందుగా అబార్షన్ గురించి ఆమె ఏం చెప్పిందంటే.. ”ముప్పై ఏళ్ల వయసులో 2013లో అండమాన్ పర్యటనకు వెళ్లాను. స్కూబా డైవింగ్ చేసిన తర్వాత కొన్ని డ్రింక్స్ తీసుకున్నాను. తర్వాత ఒక స్నేహితుడితో బెడ్ షేర్ చేసుకున్నాను. శారీరకంగా కలిశాను. కొన్నాళ్లకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ అని తేలింది. వారం రోజుల తర్వాత అబార్షన్ చేయించుకోవాలనుకున్నాను.
నేను తల్లిని కావడానికి సిద్ధంగా లేను. నేను ఊహించుకున్నట్లుగా నా జీవిత ప్రయాణం సాగట్లేదు. ఇప్పటికీ కూడా నేను సిద్ధంగా ఉన్నానని అనుకోవడం లేదు. అమ్మాయిలు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలి.. 30 ఏళ్లకు పిల్లలను కనాలి వంటి విషయాలు నాకు అర్థం కావు. అబార్షన్ చేయించుకున్నా. అయితే తప్పు చేశాననే ఫీలింగ్ నాకు లేదు. ఎలాంటి రిగ్రెట్స్ లేవు.
నా ఛాయిస్ నాకు ఉంటుంది. ప్రస్తుతం నా ఆలోచనల్లో క్లారిటీ ఉందనుకుంటున్నాను. ఈ విషయాలను ఇలా షేర్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని భావిస్తున్నాను. అందుకే ఈ పుస్తకాన్ని రాశాను. గతంలో జరిగిన సంఘటనల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను. బాడీ షేమింగ్ కి గురయ్యాను.. లైంగిక వేధింపులకు గురయ్యాను. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైతే నేను వ్యవహరించే తీరు వేరే విధంగా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.