సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన చిత్రం ‘పుష్ప2’. ఈ మూవీ పుష్ప ది రైజ్ (పార్ట్ 1) 2021 లో విడుదలై ఇండియా మొత్తం సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెల్సిందే. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవ్వటంతో పార్ట్ 2 పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. గత సంవత్సరం 2025 డిసెంబర్ 5న పుష్ప 2 మూవీ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ కి ప్లాన్ చేశారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన ప్రతి ఒక్క హృదయాన్ని కలచివేసింది.
బన్నీ ఫ్యాన్ అయిన ఒక మహిళ తన భర్త & ఇద్దరు పిల్లల్లతో కలిసి ప్రీమియర్ షో చూడటానికి, హైదరాబాద్ లో మూవీస్ కి బాగా ఫేమస్ అయిన ఆర్టీసి X రోడ్స్ లోని సంధ్య థియేటర్ కి వచ్చారు. ఆ షో కి అల్లు అర్జున్ స్వయంగా థియేటర్ బయట అభిమానులకు కరచాలనం చేస్తూ రావటంతో ఒక్కసారిగా థియేటర్ వెలుపల ప్రాంగణం అంతా తొక్కిసలాటకి గురైనది. దాంట్లో భాగంగా ఆ మహిళా అభిమాని అక్కడికక్కడే మృతి చెందటం, ఆమె కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్ళటం జరిగింది. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించటంతో హీరో అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అవ్వటం ఒకరోజు జైలు లో కూడా ఉండాల్సి వచ్చింది.

అయితే అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం కుదుటపడలేదు, ఇప్పటికీ అలానే దయనీయ పరిస్థితులలో ఉన్నాడు. కనీసం ఎవరిని గుర్తు పట్టలేకపోతున్నాడు. అతడి వైద్యానికి నెలకు సుమారుగా లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది అంట. బన్నీ తరపు నుంచి కొంత మొత్తంలో శ్రీతేజ్ పేరు మీద డబ్బు బ్యాంకు లో జమ చేసినా కూడా అతడి వైద్యానికే ఖర్చు సరిపోవట్లేదు అని బాలుడి తండ్రి వాపోతూ, కాగా అల్లు అర్జున్ మేనేజర్ ని సంప్రదిస్తే సానుకూల స్పందన లేదని శ్రీతేజ్ తండ్రి తెలిపారు.
