క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వినడం కొత్తేమీ కాదు. అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లే నటీమణులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయం పై అందరికీ ఓ క్లారిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేది కాస్త భిన్నంగా ఉంటుంది. విషయంలోకి వెళితే.. శివ్యా పటానియా బాలీవుడ్ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన నటి. మోడల్ గా కెరీర్ ను మొదలు పెట్టి తక్కువ టైంలోనే నటిగా ఫేమస్ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ్యా ఓ ఆడిషన్ లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది. ఆమె మాట్లాడుతూ.. ” ‘హమ్ సఫర్’ సిరీస్ కంప్లీట్ అయ్యాక నాకు ఆఫర్లు రాలేదు. దీంతో చాలా ఆడిషన్స్ కు హాజరయ్యాను. ఒకరోజు ఓ సంస్థ నుండి కాల్ వచ్చింది. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఓ చిన్న గది ఉంది. ఇబ్బంది పడుతూనే లోపలికి వెళ్ళాను. అక్కడ ఉన్న వ్యక్తి నన్ను చూసి తేడాగా మాట్లాడాడు.
‘నువ్వు నాతో ఒక రోజు కాంప్రమైజ్ అయితే నిన్న పెద్ద స్టార్ పక్కన యాడ్ లో నటించే ఛాన్స్ ఇస్తాను’ అని అన్నాడు. ఆ టైంలో అతను లాప్ టాప్ లో హనుమాన్ చాలీసా చూస్తూ ఉన్నాడు. అతను మాట్లాడిన దానికన్నా అతను చూస్తున్న దానికి ఎక్కువ కోపం వచ్చింది నాకు. ఓ పక్క భక్తి గీతాలు వింటూ నువ్వు మాట్లాడేది ఏంటి? సిగ్గులేదా నీకు అంటూ తిట్టి వచ్చేసాను. నా స్నేహితులకి కూడా ఆ బ్యానర్ నుండి కాల్ వస్తే వెళ్లొద్దు అని చెప్పాను.
కొద్దిరోజులకి నాకు తెలిసింది ఏంటి అంటే అది ఫేక్ బ్యానర్ అని. కేవలం అమ్మాయిలను లొంగదీసుకోవడానికి మాత్రమే ఆ బ్యానర్ ను ఏర్పాటు చేశారు అని.! అందుకే నటీమణులు ఆడిషన్ కి వెళ్లేముందు ఆ సంస్థ గురించి తెలుసుకుని వెళ్లడం మంచిది” అంటూ శివ్యా తెలియజేసింది.