Yathra2: యాత్ర2 సినిమాలో ఆ పాత్రలో నటించిన ప్రముఖ నటి ఎవరంటే?

డైరెక్టర్ మహీ వి రాఘవ దర్శకత్వంలో ఇదివరకే వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం పాదయాత్ర, ఆయన హెలికాప్టర్లు మరణించిన విషయం గురించి ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా వచ్చేయడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా (Yathra2) మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగా వైయస్ శేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనని జైలుకు పంపించడం ఆయన పాదయాత్ర, ఇతరత విషయాల గురించి యాత్ర 2 ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. అయితే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు సోనియాగాంధీ వంటి వారి పాత్రలు కీలకంగా మారబోతున్నాయి.

ఇక ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో పాత్రలో హిందీ మరాఠీ దర్శకుడు, నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నటిస్తున్నారు. ఇక యాత్ర 2లో సోనియాగాంధీ పాత్ర కూడా కీలకంగా ఉండడంతో సరదాగా ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఆ పాత్రకు జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌ని ఎంపిక చేశారు. మీరు అతన్ని ఓడించలేకపోతే.. అతని నాశనం చేయండి అని ట్యాగ్ లైన్ తో ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.

సోనియా గాంధీ పాత్రలో నటించినటువంటి సుజానే బెర్నెర్ట్‌ మరెవరో కాదు ఈమె బాలీవుడ్‌ నటుడు, దివంగత అఖిల్‌ మిశ్రా భార్య ఈమె గత 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ సినిమాలు వెబ్ సిరీస్ లో సీరియల్స్ లో నటిస్తున్నారు అయితే తెలుగులో ఈమెకు ఇది మొదటి అవకాశం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 8వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా ఎన్నికలను టార్గెట్ చేస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus