ఇటీవల దుబాయ్ నుండి అత్యధికంగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ… అక్రమ రవాణా నివారణ చట్టం అధికారులకు చిక్కింది ఓ నటి. ఆమె మరెవరో కాదు రన్యా రావ్.2025 మార్చి 3వ తేదీన రన్యా 14 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ డీఆర్ఐ అధికారులకి చిక్కింది. బంగారాన్ని కడ్డీలుగా ఆమె తరలించడానికి ప్రయత్నించినట్టు సమాచారం. వాటి విలువ రూ.14 కోట్లు అని అప్పట్లో టాక్ వినిపించింది. దీంతో ఆమెను అక్కడికక్కడే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇక పలు విచారణలు అనంతరం.. ఆమెకు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఏడాది పాటు రన్యాకి జైలు శిక్ష విధించారు. బెయిల్ కి అప్లై చేసుకునే సదుపాయం లేకుండా ఆమెకు జైలు శిక్ష విధించినట్లు సమాచారం. ఇంతకు ముందు మనీ లాండరింగ్ కేసులో కూడా ఆమె ఈడీ వారికి చిక్కింది. ఆ టైంలో రూ.34 కోట్లు విలువైన ఆస్తులపై ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.
రన్యా రావు చిక్ మగళూరు, కర్ణాటకకు చెందిన అమ్మాయి. కన్నడలో సుదీప్ ‘మాణిక్య’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తమిళ్ లో కూడా ఓ సినిమా చేసింది. హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో ఈమె క్లిక్ అవ్వలేదు. ఆఫర్స్ కూడా పెద్దగా లేవు. అందుకే ఆమె ఇలాంటి పనులకు పాల్పడినట్టు కన్నడ జనాలు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆమె ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే.