బ్రేకప్ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన నటి..!

సినిమా వాళ్ళ గురించి బ్రేకప్ వార్తలు చాలా కామన్. వీటిలో నిజం ఉంటే పర్వాలేదు. ఒకవేళ అవి నిజం కాకపోతే వాళ్ళు కూడా మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు వారికి ఫోన్లు చేసి అడగడం..ఒకవేళ వీళ్ళు అందుబాటులో లేకపోతే వీరి బంధుమిత్రుల వద్ద ఆ వార్తల గురించి ప్రస్తావించడం చివరికి వీరి ఇంట్లో కూడా ఆ విషయాలు చర్చకు రావడం వంటివి జరుగుతాయి.

ఇలాంటి వార్తల వల్ల ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తాజాగా ఓ నటి విషయంలో అలాగే జరిగింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది అంటూ ప్రచారం మొదలైంది.ఇలాంటి ప్రచారానికి ఆమె స్పందించి క్లారిటీ ఇస్తేనే కానీ ఆగలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఆమె ప్రియుడు రాకీకి బ్రేకప్ చెప్పేసిందంటూ పుకార్లు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై డిస్కషన్లు, డిబేట్ లు ఎక్కువయ్యాయి.

దీంతో వీటిపై ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ విషయం పై హీనా ఖాన్ స్పందిస్తూ.. ‘ నేను, రాకీ బ్రేకప్ అయ్యాము అంటూ వస్తున్న కథనాలు నేను విన్నాను. కానీ ఇందులో నిజం లేదు. ప్రస్తుతం మేం ఇద్దరం చాలా సంతోషంగా జీవిస్తున్నాం. అందుకు దేవుడి దయవల్లే కారణమని నేను అనుకుంటాను. కానీ మా బ్రేకప్ వార్తలు విని నాకు చాలా బాధేసింది. రాకీ పూర్తిగా భిన్నమైన మనిషి. ఇలాంటి పుకార్లను పట్టించుకోడు కాబట్టి వాటికి స్పందించలేదు.

నా స్నేహితులు చాలామంది ఈ విషయంపై నన్ను ఆరా తీయడంతో నేను స్పందించాల్సి వస్తుంది” అంటూ హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. హీనా ఖాన్ నిర్మాత రాకీతో ప్రేమ పడటంతో వీళ్ళు ప్రస్తుతం సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. హీనా ప్రస్తుతం ‘శడ్యంత్ర’ అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus