7/G Brindavana Colony: వారం రోజులు షూటింగ్లో పాల్గొని మరీ.. 7/జి నుండీ తప్పుకున్న హీరోయిన్..!

‘7 / జి బృందావన కాలనీ’.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. 18 ఏళ్ళ క్రితం అంటే 2004 అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పై మొదట ఎటువంటి హైప్ లేదు. కానీ తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరో రెగ్యులర్ సినిమాల్లో కనిపించే హీరోలా కనిపించడు..! అది ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ కలిగించింది. అతని హావభావాలు చాలా కొత్తగా, నేచురల్ గా అనిపిస్తాయి.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించారు. ఏ.ఎం.రత్నం గారి అబ్బాయి రవికృష్ణ .. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.హీరోయిన్ గా సోనియా అగర్వాల్ నటించింది. ఇదిలా ఉండగా.. సోనియా అగర్వాల్ ఈ చిత్రానికి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ కాదట. ముందుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అప్రోచ్ అయ్యిందట చిత్రబృందం.

ఫైనల్ గా కలర్స్ స్వాతిని ఫైనల్ చేశారట. ఆమెతో వారం రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. కానీ ఆమె ఆ టైంలో ఎం.బి.బి.ఎస్ చదువుకుంటూ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం వలన.. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందట. ఈ విషయాన్ని 7 / జి హీరో రవి కృష్ణ చెప్పుకొచ్చాడు. అలాగే ‘7 / జి బృందావన కాలనీ’ (7/G Brindavana Colony)  చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతున్నట్లు ఇతను స్వయంగా తెలియజేశాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus