Chiranjeevi,Balakrishna:బాలయ్య గోపీచంద్ మూవీకి హీరోయిన్ ఫిక్స్!

స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమా కోసం హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి గోపీచంద్ మలినేని త్రిషను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. క్రాక్ సినిమాతో హిట్ సాధించిన గోపీచంద్ మలినేని బాలకృష్ణతో క్రాక్ సినిమాను మించిన హిట్ తెరకెక్కించాలని భావిస్తున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య త్రిష కాంబినేషన్ లో కొన్నేళ్ల క్రితం లయన్ అనే సినిమా తెరకెక్కింది.

బాక్సాఫీస్ వద్ద లయన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా బాలయ్య త్రిష జోడి బాగుందని కామెంట్లు వినిపించాయి. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత బాలయ్య, త్రిష కలిసి నటిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చిరంజీవికి నో చెప్పిన త్రిష బాలయ్యకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఆచార్య సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషకే ఆఫర్ కాగా కొన్ని కారణాల వల్ల త్రిష ఆ ఆఫర్ ను వదులుకున్నారు.

క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆచార్యకు నో చెప్పిన త్రిష గోపీచంద్ మలినేని ఆఫర్ కు మాత్రం నో చెప్పలేకపోయారు. బాలయ్యతో నటిస్తున్న సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో త్రిషకు ఆఫర్లు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. బాలయ్య సైతం వరుస మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యే విధంగా బాలకృష్ణ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus