హీరోయిన్ ఆవేదన.. దర్శకనిర్మాతలు మారతారా?

ముంబై బ్యూటీ ఆయేషా ఖాన్ (Ayesha Khan) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో..! 2022 లో వచ్చిన ‘ముఖచిత్రం’ (Mukhachitram) తో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఈమె ఎక్కువ సేపు కనిపించదు. అయినా సరే తన గ్లామర్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్రాణాలకు తెగించి ఆ సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్లో పాల్గొన్నట్టు ఆ సినిమా దర్శకుడు చెప్పుకొచ్చాడు.అయితే ‘ముఖచిత్రం’ ఫ్లాప్ అవ్వడం వల్లో ఏమో కానీ… ఆమెకు వెంటనే ఆఫర్లు రాలేదు.

Star Actress

కొంత గ్యాప్ తర్వాత ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ‘మనమే’ (Manamey)  వంటి పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ ఇవి కూడా అమ్మడికి కలిసి రావడం లేదు. ఎందుకంటే ఈ సినిమాల్లో ఆమె చేసింది ఐటెం సాంగ్స్, వ్యాంప్ రోల్స్ లాంటివి. అందుకు తగ్గట్టే ఇందులో ఆమె స్కిన్ షో మాత్రమే హైలెట్ అయ్యింది. ఈ సినిమాలు చూసిన తర్వాత ఈమె  గురించి మాట్లాడిన వాళ్ళు లేరు.దీంతో ఈ అమ్మడు బాగా డిజప్పాయింట్ అయినట్టు ఉంది.

ఇటీవల పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ఐటెం సాంగ్స్ చేయాల్సి వస్తే.. ఆమె నో చెప్పిందట. ‘నాకు నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలు ఇవ్వండి.. ఇలాంటివి వద్దు’ అంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తుందట. ఇక ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా స్కిన్ షో చేయకుండా కొంచెం పద్ధతిగా ఫోటోలు పెట్టడం ప్రారంభించింది ఈ అమ్మడు. మరి దర్శకనిర్మాతలు ఈమె రిక్వెస్ట్ ని ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.

హిట్ కాంబో..బ్లాక్ బస్టర్ నిర్మాత.. అయినా వెనకడుగు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus