ఐదు నిమిషాల తర్వాత ఆ డైరెక్టర్ ఏం చేశాడో చెప్పిన స్టార్ నటి..!

కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉంది కానీ హాలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించినంతగా ఇతర చోట్ల మహిళలు పరువు పోతుందని ధైర్యం చేయలేక మౌనంగా ఆ బాధను భరించారు.. భరిస్తున్నారు.. అక్కడ మొదలైన మీటూ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసింది.. ఎంతో మంది ప్రముఖులు లైగింక వేధింపుల కేసులో ఇరక్కున్నారు. హాలీవుడ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నవారూ ఉన్నారు. వీలు కుదిరినప్పుడల్లా తమకు ఎదురైన అలాంటి చేదు సంఘటనల గురించి ధైర్యంగా బయట పెడుతున్నారు హీరోయిన్లు అలాగే సీనియర్ నటీమణులు..

తాజాగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ తన విషయంలో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.. విద్యా బాలన్ డేర్ అండ్ డాషింగ్.. 44 ఏళ్ళ వయసు వచ్చినా ఏదో ఒక రకంగా తన బోల్డ్ నెస్‌ను రుచి చూపిస్తూనే ఉంది. ఇటీవల ఒక్క ఫోటోతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. కెరీర్ ప్రారంభం నుండి ఈమె బోల్డ్ పాత్రలనే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.

Shocking Trolls on Actress Vidya Balan1

అలా అని నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను వదులుకుంది కూడా లేదు. మరీ ముఖ్యంగా సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందిన ‘డర్టీ పిక్చర్’ లో ఈమె ఎంత బోల్డ్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఆమెకు అలవాటు. గతంలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించిన షాకింగ్ విషయాలను వెల్లడించిందామె.. ‘‘గతంలో ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ని కలవడానికి చెన్నై వెళ్లాం.. నేను కాఫీ షాపులో కలుద్దాం అని చెప్తే..

ఆయన నన్ను గదిలోకి వెళ్లి మాట్లాడుకుందామని ఒత్తిడి తెచ్చాడు.. అతడి ఆలోచన అర్థమవడంతో హోటల్ రూమ్‌కి వెళ్లాక డోర్ క్లోజ్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా.. దీంతో షాక్ అయిన ఆ దర్శకుడు ఏమీ మాట్లాకుండా సైలెంట్ అయిపోయాడు.. 5 నిమిషాల తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు’’ అని చెప్పుకొచ్చింది విద్యా బాలన్..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus