అలాంటి సీన్ ను.. తనకు అనుకూలంగా మార్చేసుకున్నాడు : నటి ఆవేదన!

ఇంటిమేట్ సీన్స్ లేదా బెడ్-రూమ్ సీన్స్ లో నటించడానికి ఎవ్వరికైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సన్నివేశాల్లో నటిస్తున్న నటీనటులకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. తోటి నటీనటులు ఇబ్బంది పడుతున్నారా లేదా? అనే విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. లేదు అంటే ఫిమేల్ ఆర్టిస్ట్..లకి ఇబ్బందిగా అనిపిస్తుంది. బాలీవుడ్ నటి సయానీ గుప్తా (Sayani Gupta) కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందట. ‘సెకండ్ మ్యారేజ్ డాట్ కామ్’ ‘ది ల్యాండ్ ఆఫ్ కార్డ్స్’ వంటి బెంగాలీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ‘జాలీ ఎల్ ఎల్ బి 2’ ‘ఆర్టికల్ 15 ‘ వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.

Sayani Gupta

ఇటీవల ఈమె (Sayani Gupta) పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పి షాకిచ్చింది. ఆమె మాట్లాడుతూ “నేను Sruగారం గురించి ఒక పుస్తకమే రాయగలను. గతంలో నేను కొంతమంది ఫిలిం మేకర్స్ తో పనిచేశాను. ఇంటిమేT సీన్స్ లో నటించడం ఈజీనే. ఎందుకంటే ఎక్కువగా అది టెక్నికల్ వారికి సంబంధించిన విషయం. కానీ కొంతమంది నటులు దానిని అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను.

గతంలో ఓ నటుడి వల్ల నాకు చేదు అనుభవం ఎదురైంది. ఒక సినిమాలో భాగంగా బెడ్ రూమ్ సీన్లో నటించాల్సి ఉంది. ఇబ్బంది పడుతూనే ఆ సీన్లో నటించాను. ఈ క్రమంలో సీన్ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ కట్ చెప్పినా.. నాతోటి నటుడు నన్ను Kiస్ చేస్తూనే ఉన్నాడు. కొంతమంది అది చిన్న విషయమే అనిపించవచ్చు. కానీ అతని ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. అలాంటి ప్రవర్తన మంచిదైతే కాదు” అంటూ చెప్పుకొచ్చింది సయాని.

మయోసైటిస్‌.. ఎప్పుడు తెలసిందంటే.. తొలినాళ్లలో ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus