Actress: వైరల్ అవుతున్న ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరసింహారెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో హనీరోజ్ ఒకరు. ఈ సినిమాలో హనీరోజ్ రోల్ పరిమితమైనా తన అద్భుతమైన నటనతో ఆమె ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో హనీరోజ్ కు పాపులారిటీ పెరిగింది. తాజాగా ఒక సందర్భంలో హనీరోజ్ మాట్లాడుతూ నేను కెరీర్ తొలినాళ్లలో ఒక టీవీ షోకు వెళ్లానని ఆ షోకు హాజరైన ఒక వ్యక్తి నా శరీరం గురించి చెత్త కామెంట్ చేశాడని తెలిపారు.

ఆ వ్యక్తి చేసిన కామెంట్ విని యాంకర్ పగలబడి నవ్వాడని హనీరోజ్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నాకు బాధగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు. ట్రోల్స్ లో కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తే కొన్ని ట్రోల్స్ మాత్రం మనస్సుకు ఎంతో బాధను కలిగిస్తాయని హనీ రోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకప్పుడు హీరోయిన్లు బరువు పెరిగినా నెగిటివ్ కామెంట్లు వచ్చేవని హనీరోజ్ వెల్లడించడం గమనార్హం. ఇప్పుడు మాత్రం బరువు పెరిగితే లావు పెరిగిందని బండగా మారిందని అంటారని హనీ రోజ్ చెప్పుకొచ్చారు.

ఆ కామెంట్లు విన్న సమయంలో ఎంతగానో బాధ కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ట్రోల్స్ అనేవి కామన్ అని వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హనీరోజ్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. హనీరోజ్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది. హనీరోజ్ కు తెలుగులో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

హనీరోజ్ (Actress) కు ఇతర ఇండస్ట్రీలలో కూడా క్రేజ్ పెరుగుతోంది. పాత్రకు అనుగుణంగా తనను తాను మార్చుకునే విషయంలో హనీరోజ్ ముందువరసలో ఉంటారు. హనీరోజ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. హనీ రోజ్ కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా హనీ రోజ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus