నా డ్రెస్సులు పై కామెంట్లు చేసి పబ్లిసిటీ చేసుకుంటుంది మీరే!

బిగ్ బాస్ కంటెస్టెంట్(హిందీ) అలాగే సోషల్ మీడియా సెన్సేషన్ అయిన ఉర్ఫీ జావేద్ చాలా మందికి తెలిసే ఉంటుంది. చిత్ర విచిత్రమైన వస్త్రధారణతో అందాలు వడ్డించడం ఈమె నైజం. అలాగే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య పెంచుకుంది. తన వింత డ్రెస్సింగ్ … కనిపించి కనిపించినట్టు బట్టలు వేసుకుని వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమె వస్త్రాలంకరణ చూస్తే ఎవ్వరైనా హవ్వా అనాల్సిందే. ఇక ఇటీవల ఉర్ఫీ జావేద్‌ పై ఢిల్లీలో ఒక కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది.

అక్టోబర్‌లో ఆమె ఓ ‘హాయ్ హాయ్ యే మాబుల్ది’ అనే మ్యూజిక్ వీడియో చేసి రిలీజ్ చేసింది.అలాగే కమెడియన్ సునీల్ పాల్ కూడా ఆమె ధరించే దుస్తులపై అలాగే ఆమె బాడీ పార్ట్స్ పై కామెంట్లు చేసి నిందించాడు. అలాగే ఆమె పై కేసు పెట్టగా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినట్లు కథనాలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఉర్ఫీ ఓ వేడుకలో వైట్ హీల్స్ మరియు పోనీ టైల్‌తో దర్శనమిచ్చింది.

ఇదే సమయంలో తనపై నమోదైన కేసుల గురించి స్పందిస్తూ “ఇది నాకు చాలా కామెడీగా అనిపిస్తుంది. నాకు పబ్లిసిటీ పిచ్చి అంటారు కానీ నా పేరును వాడుకుని అసలు పబ్లిసిటీ తెచ్చుకునేది సునీల్ పాల్ లాంటి వాళ్ళు. నేను ఇలా డ్రెస్సింగ్ చేసుకున్నందుకు నా పేరును వాడుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు.రానున్న రోజుల్లో నాపై నమోదు అయ్యే ఎఫ్‌ఐఆర్‌లు ఏ రేపిస్ట్‌పై కూడా నమోదు కావేమో అంటూ చెప్పుకొచ్చింది.

నేను నా శరీరానికి ఏమి చుట్టుకుంటున్నాను లేదా నేను ఏమి ధరించుకుంటున్నాను అనేది నా ఇష్టం. జనం ఇది ఎప్పటి నుంచి పట్టించుకుంటున్నారు? ఇది భారతదేశమా లేక తాలిబాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్.? ఒక అమ్మాయి ఏమి ధరించాలి లేదా ధరించకూడదు అనే దానిని మీరు నియంత్రించలేరు” అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus