సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలకు ఎలాంటి కష్టాలు ఉండవని వాళ్లు సంతోషంగా జీవనం సాగిస్తారని చిన్నచిన్న సమస్యలు వచ్చినా ఆ సమస్యలను వాళ్లు సులభంగా పరిష్కరించుకునే అవకాశం అయితే ఉంటుందని చాలామంది భావిస్తారనే సంగతి తెలిసిందే. అయితే రియాలిటీలో మాత్రం హీరోయిన్ల పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. మలయాళ బ్యూటీ అర్థనా బిను తెలుగులో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడంతో అర్థనా బినుకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు.
తమిళ, మలయాళ భాషల్లో మాత్రం ఈ బ్యూటీకి ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది. అయితే ఈ నటి తాజాగా తండ్రి విజయకుమార్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తన తండ్రి చేస్తున్న ఆరోపణలపై కూడా ఈ హీరోయిన్ క్లారిటీ ఇచ్చారు. మా నాన్న మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు. మా నాన్న ఆరోపణలు నిజమైతే ఆయన గోడ దూకి ఎందుకు వెళ్లాడని ఈ హీరోయిన్ ప్రశ్నించారు.
కోర్టు అమ్మకు, అతడికి విడాకులు మంజూరు చేసిందని సాక్ష్యాలను పోస్ట్ చేస్తున్నానని అర్థనా బిను వెల్లడించారు. అమ్మకు నాన్న బంగారం, 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని ఆమె చెప్పుకొచ్చారు. నాన్న డబ్బు పంపిన వెంటనే అమ్మ థాంక్యూ అనే మెసేజ్ చేసిందని (Actress) అర్థనా బిను అన్నారు.
నాన్న మాత్రం 40000 అందాయో లేదో తెలుసుకుందామని ఇంటికి వచ్చానని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు. జరిగిన పరిణామాలకు సంబంధించి కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశానని అర్థనా బిను అన్నారు. ఇప్పటికే నాన్నపై వేసిన కేసులు విచారణ దశలో ఉన్నాయని అర్థనా బిను వెల్లడించారు. అర్థనా బిను చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!