ప్రముఖ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ క్రాంతి బలివాడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీరియల్స్ కు డబ్బింగ్ చెప్పే సమయంలో సీరియల్ లో నటిగా ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సీరియల్ డబ్బింగ్ ను స్టాప్ చేశానని నా పాత్రకు కూడా వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పే పరిస్థితి చెప్పే పరిస్థితి ఏర్పడిందని క్రాంతి అన్నారు. ఇండస్ట్రీలో అందరూ నాకు సపోర్ట్ చేశారని తాను వివాదాలకు దూరమని ఆమె చెప్పుకొచ్చారు. సీరియల్స్ లో కనిపించే వాళ్లకు సినిమాలలో ఎక్కువగా ఆఫర్లు ఇవ్వరని క్రాంతి కామెంట్లు చేశారు.
ఈ రీజన్ వల్లే చాలామంది ఆర్టిస్టులు టీవీకి దూరమై సినిమాల్లోకి వెళ్లారని క్రాంతి కామెంట్లు చేశారు. లాస్ట్ ఇయర్ నుంచి సీరియల్స్ ఆపేసి తాను సినిమాలకే పరిమితమయ్యానని క్రాంతి చెప్పుకొచ్చారు. తెలుగు ఆర్టిస్టులకు ఎక్కువ ఆఫర్లు ఇవ్వకపోవడంతో మన ఆర్టిస్టులు ఫీలవుతున్నారని క్రాంతి వెల్లడించారు. బోల్డ్ సీన్స్ కు బాలీవుడ్ వాళ్లు ఓకే చెబుతారనే అందుకే వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నామని మేకర్స్ చెబుతున్నారని క్రాంతి అన్నారు. ప్రకాష్ రాజ్ ను చూస్తే ఎవరైనా భయపడతారని క్రాంతి చెప్పుకొచ్చారు.
ప్రకాష్ రాజ్ కు తెలుగు అలవాటైపోయిందని ఆయన పేపర్లను తిరగేసి డైలాగ్ ను చెబుతారని క్రాంతి కామెంట్లు చేశారు. సీనియర్స్ తో యాక్ట్ చేస్తే ఎప్పుడూ భయంగానే ఉంటుందని ఆమె అన్నారు. సీనియర్లతో చేసే సమయంలో మన వల్ల షాట్ ఫెయిల్ కాకూడదనే టెన్షన్ మనకు ఉంటుందని క్రాంతి అన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కావడం వల్ల డైలాగ్స్ బాగా గుర్తుంటాయని క్రాంతి చెప్పుకొచ్చారు. ఆటో నగర్ సూర్య సినిమాలోని పాత్ర మాత్రం నన్ను భయపెట్టిందని ఆమె తెలిపారు.
ఆ సినిమాలో త్రిశూలం ఇచ్చి పొడవాలని చెప్పడంతో యాక్షన్ చేయడం ఇంత కష్టమా? అని అనిపించిందని క్రాంతి తెలిపారు. క్రాంతి బలివాడకు నటిగా రేసుగుర్రం సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో క్రాంతి బలివాడ బిజీగా ఉన్నారు.