‘భర్త వేధిస్తే నన్ను ట్రోల్ చేశారు’ నటి ఆవేదన!

టీవీ నటి నిషా రావల్ తన మాజీ భర్త, నటుడు కరణ్ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘లాకప్’ అనే రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గతేడాది తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభవాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో తన భర్త ఎక్ట్రా మారిటల్ ఎఫైర్ గురించి మాట్లాడింది. పాయల్ రోహత్గీతో తన భర్త ఎఫైర్ పెట్టుకొని..

తనను ఒంటరిగా వదిలేసి, తమ కుమారుడు కవిష్ ను తీసుకొని ముంబై వెళ్లిపోయాడంటూ ఏడ్చేసింది. పాయల్ తో కరణ్ సీక్రెట్ గా మాట్లాడడం చూసి తనకు అనుమానం వచ్చి నిలదీయడంతో అతడు ఎఫైర్ ఉందనే విషయం ఒప్పుకున్నాడని చెప్పింది నిషా. ఐదారు నెలలుగా పాయల్ తో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నానని.. అలానే నిన్ను కూడా ఇష్టపడుతున్నా అని తన భర్త చెప్పడంతో షాకయ్యాయని చెప్పింది నిషా. అతడి మాటలు ఎంతో బాధించాయని..

మరోసారి అతడిని నమ్మి మోసపోవాలనుకోలేదని.. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అయితే కరణ్-పాయల్ ల వివాహేతర సంబంధం బయటపెట్టిన తరువాత తమ మధ్య గొడవలు జరిగేవని చెప్పింది నిషా. ఈ క్రమంలో కరణ్ తనను మానసికంగా, భౌతికంగా గాయపరిచేవాడని స్పష్టం చేసింది. ఆ గాయాలతో మీడియా ముందుకొస్తే తనను దారుణంగా ట్రోల్ చేశారని.. కెచప్ రాసుకొని నాటకాలు ఆడుతుందంటూ ఈ సొసైటీ తనను నిందించిందని వాపోయింది నిషా.

గతేడాది నిషా-కరణ్ లు విడాకులు తీసుకున్నారు. ఆ విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది. కరణ్ పై నిషా కేసు పెట్టడంతో అతడిని అరెస్ట్ కూడా చేశారు. ఈ మధ్యనే బెయిల్ పై బయటకు వచ్చాడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus