Actress: మీటూ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్ హీరోయిన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ పలు సినిమాలలో కీలకపాత్రలలో నటించిన నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె సినిమాల కన్నా వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు 2013 వ సంవత్సరంలో ఈమె బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. డైరెక్టర్ అనురాగ్ హోటల్ గదిలో తనను రేప్ చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా డైరెక్టర్ గురించి ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఈమె డైరెక్టర్ అనురాగ్ గురించి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడంతో పోలీసులు కూడా తనని ప్రశ్నించారు. అయితే చివరికి ఆయన ఈ విషయం గురించి నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈమె ఆరోపణలు చేసిన ఆ సమయంలో తాను ముంబైలోనే లేను అంటూ ఈయన వివరణ ఇచ్చుకున్నారు.

ఇలా పలు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచినటువంటి ఈమె మరోసారి మీటూ ఉద్యమం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పాయల్ ఘోష్ నటించిన ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి పాయల్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా (Actress) ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలలో అవకాశాలు అందుకోవాలని తప్పకుండా బెడ్ రూమ్ కి వెళ్లాల్సిందేనని తెలిపారు. నేను కనుక అలా చేసి ఉంటే ఈపాటికి నాకు ఇది 30వ సినిమా అయి ఉండేదని ఈమె కామెంట్ చేశారు. ఇలా పెద్ద సినిమా అవకాశాలు రావాలి అంటే బెడ్ షేర్ చేసుకోవాల్సిందేనని పాయల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాలో ఈమె సపోర్టింగ్ పాత్రలో నటించారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus