NTR30: ఎన్టీఆర్- కొరటాల మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • September 3, 2022 / 07:41 PM IST

‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో.. అభిమానులు ఈ మూవీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.నిజానికి ఈ చిత్రం షూటింగ్ జూలై ప్రారంభం అవుతుంది అన్నారు. కానీ, కొరటాల శివ ‘ఆచార్య’ రిజల్ట్ తో స్క్రిప్ట్ లో మార్పులు చేసే పనిలో పడటంతో ఈ మూవీ షూటింగ్ డిలే అవుతూ వస్తోంది.

ఈ నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. నటీనటుల ఎంపిక కూడా దర్శకుడు కొరటాల శివ మొదలుపెట్టాడట. ఎన్టీఆర్ కెరీర్లో 30 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందనుంది. కాబట్టి పరభాషా నటీనటులను కూడా ఎంపిక చేసుకోవాలని కొరటాల భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో .. ఓ ముఖ్య పాత్ర కోసం కన్నడ నటి రుషిక రాజ్ ను ఎంపిక చేసుకున్నట్టు వినికిడి.

ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గత ఏడాది వచ్చిన ‘అశ్మీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ మూవీలో ఈమె బోల్డ్ నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి.ప్రస్తుతం ఆమె కన్నడ లో రెండు, మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఇక ఎన్టీఆర్- కొరటాల మూవీకి ఈ మధ్యనే ఆమె సైన్ చేసినట్టు తెలుస్తుంది.

‘ఎన్టీఆర్ 30’ ఓ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ రోల్ ఉంటుందట. రుషిక 5 అడుగుల 11 అంగుళాల హైట్ ఉంటుంది కాబట్టి.. అలాంటి పవర్ ఫుల్ రోల్ కు ఈమెను ఎంపిక చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus