సమాజంలో ఏం జరిగినా… సినిమా వాళ్లు స్పందించాలి, స్పందించకపోతే సోషల్ మీడియాలో అభిమానం పేరుతో దుమ్మెత్తిపోస్తారు. అయితే అలా స్పందిస్తే మరికొన్ని సమస్యలు వస్తాయి. మిగిలిన విషయాలు మాట్లాడే ముందు మీ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో చూడండి అంటూ సలహాలు మొదలవుతాయి. తాజాగా విశాల్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. విశాల్‌ను ఆ మాట అన్నది కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే.
చెన్నైలో పీఎస్బీబీ స్కూల్ లో పని చేస్తోన్న ఓ టీచర్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం ఇటీవల బయటకు వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఆ టీచర్‌ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విశాల్ కూడా స్పందించారు. అలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.
అయితే నటి, కొరియోగ్రాఫర్ గాయత్రి రఘురామ్.. విశాల్‌ను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో జరుగుతోన్న లైంగిక వేధింపులను ముందు ఖండించండి అంటూ సలహా ఇచ్చింది. ‘‘సినిమా పరిశ్రమకు కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఏం జరుగుతోందో చూడండి. కథానాయికలు, నటీమణులు వేధింపులు ఎదుర్కొంటున్నారు. మీరు, మీ లాంటి వాళ్ల వల్ల పరిశ్రమలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వాళ్లంతా మీ నుండి దూరంగా పారిపోతున్నారు’’అని ట్వీట్ చేసింది గాయత్రి.
అయితే గాయత్రి పోస్టుకు విశాల్ ఇప్పటివరకు స్పందించలేదు. గాయత్రి మనకు బాగా తెలిసిన అమ్మాయే. ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమకు వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ పెద్దగా అవకాశాలు సంపాదించలేక తమిళ పరిశ్రమకు వెళ్లిపోయింది. అక్కడ నటిగా, కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతోంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ చేరి రాజకీయాల్లోనూ క్రియాశీలంకగా ఉంటోంది.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!