బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన భామల్లో అరియానా గ్లోరీ (Ariyana Glory) ఒకరు. వెండితెరపై ఈమె బిజీ అవ్వలేదు.. కానీ బుల్లితెరపై మాత్రం బాగానే సందడి చేస్తుంది. 2సార్లు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా సందడి చేస్తుంది. తన జీవితంలోని ఓ చీకటి ప్రేమ అధ్యాయాన్ని బయటపెట్టి సంచలనం సృష్టించింది.ఆమె ప్రేమకథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. 9వ తరగతి చదువుతున్నప్పుడే విజయవాడకు చెందిన ఓ అబ్బాయితో అరియానా ప్రేమలో పడింది అరియానా (Ariyana Glory).
తను తాండూరులో, అతను విజయవాడలో ఉన్నా వారి మధ్య ప్రేమ బంధం మాత్రం బలంగానే కొనసాగింది. తన ఇంటర్న్-షిప్ పూర్తయ్యాక హైదరాబాద్‌కు మకాం మార్చిన అరియానా, ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి 3 ఏళ్లపాటు ఒకే గదిలో సహజీవనం చేసిందట. ఆ సమయంలో తామిద్దరం ప్రాణానికి ప్రాణంగా కలిసిపోయామని ఆమె గుర్తుచేసుకుంది. కానీ కొంతకాలానికి ఓ రోజు ఆమె చూడకూడని దృశ్యాన్ని కళ్లారా చూసిందట.
ఆ క్షణం ఆమె గుండె వేయి ముక్కలైందని చెప్పి షాకిచ్చింది. ‘ఆ నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక ఇద్దరూ విడిపోయారు. కానీ, అతను మళ్లీ వెనక్కి వచ్చి, పెళ్లి చేసుకుంటానని ప్రాధేయపడటంతో ఆమె మనసు కరిగి మరోసారి ఒకటయ్యారట. అలా మరో రెండేళ్లు వారి బంధం కొనసాగిందట. ఓ రోజు అరియానా (Ariyana Glory) ఆర్జే కావాలనుకుంటున్నానని, ఓ కోర్సులో చేరతానని ప్రియుడిని అనుమతి అడిగిందట. తర్వాత వృత్తిపరంగా ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడిందట.
ఆ పరిచయాన్ని అరియానా ప్రియుడు తట్టుకోలేకపోయాడట. అప్పటి నుండి అరియానాను అనుమానంతో పీడించాడట. ‘ఆ అబ్బాయితో ఎలాంటి సంబంధం లేదని’ ఎంత చెప్పినా అతను వినకపోవడంతో ఆ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చిందని ఆమె తెలిపింది.’నాకు నాన్న లేరు. ఆ లోటును అతను తన కేరింగ్‌తో తీర్చాడు. అందుకే అంతలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికీ అతడిని గుర్తుచేసుకుంటాను’ అంటూ అరియానా ఎమోషనల్ కామెంట్స్ తో తన ప్రేమ కథని చెప్పుకొచ్చింది.