NBK108: బాలయ్య- అనిల్ రావిపూడి సినిమాలో ఆ స్టార్ యాంకర్ కు ఛాన్స్..!

2023 సంక్రాంతికి బాలయ్య 107వ సినిమాగా ‘వీరసింహారెడ్డి’ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్నటితో అనగా మార్చి 2తో 50 రోజులు పూర్తి చేసుకుంది. నిన్నటివరకు తారకరత్న మరణం తర్వాత జరగాల్సిన చిన్న కర్మ, పెద్ద కర్మ పనుల్లో బాలయ్య బిజీగా గడిపారు. మార్చి 4 నుండి ఆయన తన నెక్స్ట్ మూవీ అనగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న మూవీ షూటింగ్లో తిరిగి జాయిన్ అవుతారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది అని టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా నటించడానికి ఆమె ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం అందుకున్నట్టు వినికిడి. ఇక ఈ మూవీలో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటించబోతుంది. ఆమెకు కూడా రూ.70 లక్షలు పారితోషికం ఇస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో మరో ముఖ్యమైన పాత్ర కోసం బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి ఎంపికైనట్టు సమాచారం.

బుల్లితెర పై గ్లామరస్ యాంకర్స్ అంటే అనసూయ, రష్మీ లతో పాటు శ్రీముఖి పేరు కూడా ఎక్కువగా చెబుతుంటారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తర్వాత బుల్లితెర పై బిజీ యాంకర్ గా రాణించింది. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ ఓ ముఖ్యపాత్రను పోషించనుంది. అలాగే బాలయ్య 108లో ఈమె బాలయ్య కూతురుగా చేస్తున్న శ్రీలీలకి ఫ్రెండ్ పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus