Kota Srinivasa Rao: కోటాశ్రీనివాసరావుని ఆ కమెడియన్ ఎందుకు చితకబాదడో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

టాలీవుడ్ దిగ్గజ స్థాయి నటుల లిస్ట్ తీస్తే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు పేర్లలో ప్రముఖులు కోటా శ్రీనివాసరావు. ఈ ఇరువురు కూడా ఎలాంటి పాత్రని అయ్యిన అవలీల గా పోషించగల మహానటులు. అయితే కోటా శ్రీనివాస రావు అన్నీ రకాల పాత్రలు పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకుంటే,బ్రహ్మానందం మాత్రం కేవలం కమెడియన్ గా స్థిరపడ్డాడు. సుమారుగా వెయ్యికి పైగా సినిమాలలో కమెడియన్ నటించి గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కి చరిత్ర సృష్టించాడు

బ్రహ్మానందం సీరియస్ పాత్రలు,సెంటిమెంట్ పాత్రలు పోషించాడు కానీ, వాటి సంఖ్య చాలా తక్కువే. గతం లో ఆయన బాబాయ్ హోటల్ అనే చిత్రం లో నటించాడు,ఇందులో సెంటిమెంట్ యాక్టింగ్ లో బ్రహ్మానందం ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘రంగమార్తాండ’ చిత్రం లో సెంటిమెంట్ ఏ రేంజ్ లో పండించాడో మన అందరం చూసాము.

మరో విశేషం ఏమిటంటే బ్రహ్మానందం మరియు కోటా శ్రీనివాసరావు సినీ కెరీర్లు ‘అహనా పెళ్ళంట’ చిత్రం తోనే ప్రారంభం అయ్యింది. ఇందులో కోటశ్రీనివాస రావు యజమాని గా, బ్రహ్మానందం సర్వెంట్ గా కనిపిస్తారు. కోటా శ్రీనివాస రావు పీనాసి తనం ని చూసి పిచ్చెక్కి పోతూ ‘పోతావ్ రా రేయ్..నాశనం అయిపోతావ్’ అని మనసులో అనుకుంటూ ఉంటాడు బ్రహ్మానందం.

అయితే క్లైమాక్స్ లో బ్రహ్మానందం (Kota Srinivasa Rao) కోటశ్రీనివాస రావు నెత్తి మీద రెండు పీకి, తిట్టే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సన్నివేశం లో ఎమోషన్ సరిగ్గా పండేందుకు కోటశ్రీనివాస రావు నిజంగానే కొట్టమని అన్నాడట. అలా ఆ షాట్ బాగా రావడానికి నాలుగు టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అంటే 8 సార్లు బ్రహ్మనందం కోటశ్రీనివాస రావు ని షూటింగ్ లో అందరూ చూస్తుండగా కొట్టాడు అన్నమాట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus