Star Comedian: సుహాస్ తో పాటు ఆ కమెడియన్ దశ కూడా తిరిగింది!

కమెడియన్లు హీరోలుగా మారడం.. హిట్లు కొట్టడం అనేది కొత్త విషయం కాదు. ఎప్పటి నుండో ఉన్నదే.. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొంత‌మంది అయితే ఇప్పుడు హీరోలుగా కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా వీరికి సహకరిస్తున్నాయి. ఫామ్లో ఉన్న కమెడియన్ ను మెయిన్ రోల్ గా పెట్టి మినిమమ్ బడ్జెట్ లో సినిమాలు చేస్తే.. డిజిటల్ రైట్సే భారీగా పలుకుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీ కోసమని తీసిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేస్తే వాటికి భారీ కలెక్షన్స్ నమోదయ్యాయి.

ఆ సినిమాలే.. ‘రైటర్ పద్మభూషణ్’ ‘బలగం’. ఇవి రెండు కూడా థియేటర్లలో సక్సెస్ అవుతాయని దర్శకనిర్మాతలు ఊహించలేదు. కానీ అద్భుతమైన విజయాలు సొంతం చేసుకున్నాయి. సుహాస్ ఒక్కసారిగా రూ.2 కోట్ల హీరో అయిపోయాడు. అతను అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. ఇప్పుడు ప్రియదర్శి కూడా అంతే..! ‘పెళ్లి చూపులు’ ‘ఎఫ్2’ వంటి చిత్రాల్లో క‌మెడియ‌న్ గా కనిపించిన ఇతను తర్వాత ఫ్రెండ్ రోల్స్ చేస్తూ బిజీ అయ్యాడు.  ప్రియద‌ర్శి కామెడీ చాలా బాగా చేస్తాడు.

కానీ అక్కడి వరకే అతను ఆగిపోలేదు. విలక్షణ నటుడిగా కూడా రాణించాలి అనుకున్నాడు. ఈ క్రమంలో ‘మల్లేశం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అది సక్సెస్ అయ్యింది. ‘జాతి రత్నాలు’ ‘బ్రోచేవారెవరురా’ చిత్రాల్లో కూడా ఇతను హీరోకి సమానమైన పాత్రే పోషించాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన ‘బలగం’ లో మరోసారి హీరోగా చేశాడు. అది సూపర్ సక్సెస్ అందుకుంది. అందుకే ఇప్పుడు రూ.2 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. అందుకు దర్శక నిర్మాతలు హ్యాపీగా ఓకే చెప్పేస్తున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus