ప్రముఖ నటుడు వడివేలు తల్లి సరోజిని కన్నుమూత!

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ కమెడియన్లలో వడివేలు ఒకరనే సంగతి తెలిసిందే. వడివేలు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే తాజాగా వడివేలు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. వడివేలు తల్లి సరోజిని(87) అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు. మధురైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. గత కొంతకాలంగా సరోజిని వయోభారం అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని తెలుస్తోంది.

ఒక మూవీ షూటింగ్ లో ఉన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసిన వెంటనే హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. మధురైకు సమీపంలో ఉన్న విరగానూర్ లో వడివేలు నివశిస్తున్నారు. ఈరోజు సాయంత్రం సరోజిని అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. ఈ విషయం తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. తల్లి మరణ వార్త తెలిసి వడివేలు శోకసంద్రంలో మునిగిపోయారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సరోజిని మృతికి సంతాపం తెలియజేశారు.

ప్రస్తుతం వడివేలు చంద్రముఖి2 సినిమాలో నటిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు సరోజిని అంత్యక్రియలకు హాజరు కానున్నారని తెలుస్తోంది. వడివేలు పలు తెలుగు సినిమాలలో కూడా నటించి ఇక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా వడివేలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పలు వివాదాల ద్వారా కూడా వడివేలు వార్తల్లో నిలిచారు. వరుస విషాదాలు కోలీవుడ్ సినీ పరిశ్రమను బాధ పెడుతున్నాయి.

వడివేలుకు దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఈ బాధ నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గతేడాది వడివేలు నటించి విడుదలైన శేఖర్ రిటర్న్స్ సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus