Venu Madhav: ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ మృతికి అసలు కారణాలివే!

మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో వేణుమాధవ్ ఒకరనే సంగతి తెలిసిందే. కృష్ణ హీరోగా తెరకెక్కిన సంప్రదాయం అనే సినిమాతో కమెడియన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన వేణు మాధవ్ 400కు పైగా సినిమాలలో నటించారు. బాల్యం నుంచి వేణు మాధవ్ కు డ్యాన్స్ అంటే ఇష్టం కాగా ఏ ప్రత్యేక సందర్భం ఉన్నా డ్యాన్స్ చేయడానికి ఆయన ఆసక్తి చూపించేవారు.

రవీంద్ర భారతిలో వేణు మాధవ్ చేసిన స్కిట్ వల్ల ఆయన కెరీర్ మలుపు తిరిగి సంప్రదాయం సినిమాలో ఛాన్స్ వచ్చింది. సంప్రదాయం సినిమా కోసం వేణు మాధవ్ ఏకంగా 70 వేల రూపాయల పారితోషికం తీసుకున్నారు. వేణు మాధవ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తన పుట్టినరోజును అనాథ శరణాలయంలో జరుపుకోవడానికి ఆసక్తి చూపించేవారు. వేణు మాధవ్ అభిమాన నటుడు సీనియర్ ఎన్టీఆర్ కాగా ఆయనపై ఉన్న అభిమానంతో చాలా సందర్భాల్లో వేణు మాధవ్ టీడీపీ తరపున ప్రచారం చేశారు.

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే కావాలని అనుకున్న వేణు మాధవ్ కొన్ని కారణాల వల్ల ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయారు. వేణు మాధవ్ మృతికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా ఆయన కుటుంబ సభ్యులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డెంగ్యూ ఫీవర్ వల్ల వేణు మాధవ్ మృతి చెందాడని తెలిపారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వేణు మాధవ్ ప్రాణాలు కోల్పోయారని ఆయన భార్య, కొడుకులు వెల్లడించారు.

వేణు మాధవ్ చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన బ్రదర్ మరణించాడని బ్రదర్ చనిపోవడం వల్ల వేణు మాధవ్ డిప్రెషన్ కు గురయ్యాడని వేణు మాధవ్ భార్య శ్రీవాణి వెల్లడించారు. వేణు మాధవ్ కొడుకులు మాట్లాడుతూ నాన్నగారికి మద్యం అలవాటు ఉందని అయితే ఆయన మరణానికి మద్యం కారణం కాదని అన్నారు. డెంగ్యూ ఫీవర్ కు చికిత్స చేయించుకోకపోవడంతో ఊపిరితిత్తులు చెడిపోయి నాన్న మృతి చెందారని వేణు మాధవ్ కొడుకులు వెల్లడించారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus