ఎంత పెద్ద సినిమా నిర్మాణ సంస్థ అయినా ఒకసారి రెండు మూడు సినిమాలు హ్యాండిల్ చేస్తుందేమో కానీ… అన్నేసి సినిమాలు ప్రకటించదు. గతంలో ఎప్పుడో దివంగత తారకరత్న ఇలా ఒకేసారి తొమ్మిది సినిమాలు ప్రారంభించాడు. కానీ నిర్మాతలు మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ కపుల్ రిచా చద్దా, అలీ ఫజల్ నిర్మాతలుగా మారి ఒకేసారి ఐదు చిత్రాలు ప్రకటించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
పుషింగ్ బటన్స్ స్టూడియోస్ పేరుతో (Richa Chadha) రిచా చద్దా, అలీ ఫజల్ ఇటీవల ఓ బ్యానర్ స్థాపంంచారు. అందులో మొదటి చిత్రంగా తెరకెక్కించిన ‘గాళ్స్ విల్ బీ గాళ్స్’ ఇటీవల ప్రతిష్ఠాత్మక సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ సినిమాకు మంచి స్పందన రావడంతోపాటు… ఆడియన్స్ ఛాయిస్ ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకుంది. అలాగే ఆ సినిమాలో నటించిన ప్రీతి పాణిగ్రాహి ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. ఆ అవార్డులు ఇచ్చిన ఉత్సాహమో ఏమో ఒకేసారి ఐదు సినిమాలు ప్రకటించారు స్టార్ కపుల్.
ఉత్తమ, వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం, కొత్త ప్రతిభను వెలికితీయడం మాకు చాలా ఇష్టం. అదే ప్యాషన్‌గా మేం ముందుకెళ్తున్నాం. ‘ది గాళ్స్ విల్ బీ గాళ్స్’ విజయం మా ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మా అంకితభావాన్ని మరింత ముందుకు నడిపించేందుకు సాయపడింది అని రిచా చద్దా చెప్పింది. ఈ క్రమంలో ‘పాపిత’, ‘పింకీ ప్రామిస్’, ‘రియాలిటటీ’, ‘మిస్ పామోలివ్ క్యాబరేట్’ తదితర చిత్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.
‘పాపిత’ క్రైం థ్రిల్లర్ కాగా.. అశుతోష్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తారు. అమితోష్ నాగ్‌పాల్ రాసిన ‘పింకీ ప్రామిస్’ అనే నవల ఆధారంగా అదే పేరుతో మ్యూజికల్ కామెడీ సినిమా తెరకెక్కిస్తారు. రాహుల్ సింగ్ దత్తా దర్శకత్వంలో ‘రియాలిటీ’ అనే డాక్యుమెంటరీ రూపొందనుంది. కమల్ స్వరూప్‌తో ‘మిస్ పామోలివ్ క్యాబరెట్’ అనే ఫాంటసీ డ్రామా రూపొందిస్తున్నారు.
జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!