Nayanthara: మీ భర్త టైటిల్‌ లాగేసుకున్నాడు నయనతార… దర్శకుడి సంచలన ఆరోపణలు!

‘మూడు సెకన్ల క్లిప్‌కి రూ. 10 కోట్లు ఇవ్వాలా?’ అంటూ ధనుష్‌ (Dhanush)  గురించి నయనతార (Nayanthara) రిలీజ్‌ చేసిన ఓ లెటర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని సమర్థించేవారు కొంతమంది అయితే.. వ్యతిరేకించేవారు మరికొందరు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని ఆలోచించుంచుకుంటున్న క్రమంలో ఓ కొత్త నిర్మాత చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు తమిళనాట వైరల్‌గా మారాయి. ‘‘నానుమ్ రౌడీ థాన్’ అనే సినిమా నుంచి 3 సెకన్ల ఫుటేజీని తన వెడ్డింగ్‌ డాక్యుమెంటరీలో ఉపయోగించడానికి అనుమతి ఇవ్వడం లేదని..

Nayanthara

దానికిగాను రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నార’’ హీరో ధనుష్‌పై నయనతార సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎస్ఎస్.కుమరన్ అనే నిర్మాత ఈ విషయంలోకి ఓ టైటిల్‌ గొడవను తీసుకొచ్చారు. నేను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని తెలిసి కూడా మీ భర్త విఘ్నేశ్‌ (Vignesh Shivan)  ‘ఎల్‌ఐసీ’ అనే టైటిల్‌ని తన సినిమా కోసం ఉపయోగించారు. టైటిల్‌ గురించి తొలుత వేరే వ్యక్తితో నన్ను సంప్రదించారు.

అయితే తన దగ్గర ఉన్న కథకు ఆ టైటిల్‌ బాగుంటుందని, ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పాను. అయినా నా అనుమతి లేకుండా నా టైటిల్‌ని మీ భర్త ఉపయోగించారు. దీనిని సమర్దిస్తారా అని కుమరన్‌ అన్నారు. మీ డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ థాన్‌’ సినిమా ఫుటేజీని ఉపయోగించడానికి మీ కంటే శక్తివంతమైన వ్యక్తి నుండి అనుమతి కోసం రెండేళ్లు వెయిట్ చేశారు. కానీ నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్ను తొక్కేశారు. మీవల్ల నేను చాలా మానసిక క్షోభ అనుభవించాను.

అది నా సినిమాపై ప్రభావం చూపించింది అని కుమరన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మీరేమి సినిమాల్లో ఉచితంగా నటించడం లేదు కదా. కానీ మీరు మాత్రం ఆ సినిమా ఫుటేజ్‌ని, ఇతరుల సినిమాల టైటిల్‌ని ఉచితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీరు, మీ భర్త సృష్టించిన భయంకరమైన ట్రెండ్ అని లేఖలో కుమరన్‌ పేర్కొన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus