Ravi Teja: రవి తేజ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్న స్టార్ డైరెక్టర్..!

  • November 23, 2023 / 03:18 PM IST

ఇండ్రస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారి లిస్ట్ తీస్తే టాప్ 5లో హీరో రవితేజ ఉంటారు. టాలీవుడ్ ఎంతమంది హీరోలు ఉన్నా మాస్ హీరో రవితేజ కి స్పెషల్ క్రేజీ ఉంటుంది. మొదట క్యారెక్టర్ ఆరిస్టుగా వచ్చిన రవితేజ ఇప్పుడు ఎలాంటి స్థానంలో ఉన్నారో మనకు తెలిసిందే . ఒకప్పుడు రవితేజ సినిమాలో వరుసగా హిట్ అవుతూ వచ్చాయి . ఇటీవల కాలంలో రవితేజ నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ మధ్యకాలంలో రవితేజ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . ధమాకా సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆయన తన ఖాతాలో హిట్ వేసుకోలేకపోయాడు . ఈ క్రమంలోనే ఎవర్ గ్రీన్ హిట్ కాంబో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా ఓ సినిమా ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలలో వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది.

ఈ బిగ్ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాలి అనుకున్న మాట వాస్తవమే కానీ.. అది రవితేజతో తీస్తే అనుకున్నంత ప్రాఫిట్స్ రావు అని.. ధమాకా సినిమా తర్వాత రవితేజతో సినిమాలు తీసిన ఒక్క నిర్మాత కూడా లాభాల కళ్ళు చూడలేదని అందుకే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఆపేయడం బెటర్ అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యారట . అంతేకాదు ఇదే విషయం (Ravi Teja) రవితేజకు చెప్పగా రవితేజ కూడా సున్నితంగానే ఈ నిర్ణయానికి ఓకే చెప్పారట.

అంతేకాదు మైత్రి సంస్థతో గోపీచంద్ మలినేని తీసుకున్న డేట్స్ ఇప్పుడు మరో హీరో కోసం వాడే ప్రయత్నం చేస్తున్నారట . ఇది నిజంగా రవితేజ అభిమానులకి జీర్ణించుకోలేని విషయం అని చెప్పాలి . ఒక సినిమా హిట్ పడితే కానీ మళ్లీ రవితేజ హిట్ ట్రాక్ లోకి రాలేడు . డైరెక్టర్స్ కూడా ఆయనతో సినిమాలను తెర్స్కెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపించరు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..!

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus