హీరో కష్టానికి గుర్తింపు రాలేదన్న దర్శకుడు

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌… ఆత్మహత్య చేసుకుని ఇన్నాళ్లయినా ఆయనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానాలు, చిన్న చూపు చూడటాల గురించి చర్చ ఆగలేదు. తాజాగా ‘కేథార్‌నాథ్‌’ సినిమా దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ మరోసారి ఆ చర్చ లేపాడు. ఆ సినిమా సమయంలో సుశాంత్‌ రాజ్‌పూత్‌ పడ్డ కష్టం, ఆ తర్వాత అతనికి వచ్చిన ఆదరణ తదితర విషయాల గురించి మాట్లాడాడు. దీంతో మరోసారి సుశాంత్‌ టాపిక్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ అభిషేక్‌ ఏమన్నాడంటే?

‘‘కేదార్‌నాథ్‌’ చిత్రం కోసం కేథార్‌నాథ్‌లోనే ఎక్కువ శాతం చిత్రీకరణ జరిపాం. ఆ సమయంలో సుశాంత్‌ చాలా కష్టపడ్డాడు. ఎముకలు కొరికే చలిలో వీపుపై కథానాయిక సారా అలీ ఖాన్‌ను ఎత్తుకుని నడిచేవాడు. ఏదన్నా టేక్‌ సరిగ్గా కుదర్లేదు, ఇంకోసారి తీద్దామన్నప్పుడు ఎప్పుడూ ‘నో’ చెప్పలేదు. ఎందుకంటే సుశాంత్‌ మానసికంగా, శారీరకంగా చాలా దృఢమైన వ్యక్తి. వీపుపై బరువుతో కొండలు ఎక్కడం అంత ఈజీ కాదు. అందరూ ఈ పని చేయలేరు. అందులోనూ రీటేక్‌లు అంటే చిన్న విషయం కాదు. నటుడిగా సుశాంత్‌ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో పని చేశాడు’’ అని చెప్పాడు అభిషేక్‌.

‘‘షూటింగ్‌ టైమ్‌లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలకు పడిపోయిన సందర్భాలున్నాయి. సెట్‌లో అందరూ చలిని తట్టుకోవడానికి చలి కోట్‌లు వేసుకుంటే.. సుశాంత్‌ వణికిపోతూ, తడిచేవాడు కానీ ఎప్పుడూ కోట్‌ వేసుకోలేదు. సినిమా మంచిగా రావాలని శ్రమించాడు. తీరా ‘కేదార్‌నాథ్’ విడుదలయ్యాక పరిస్థితి వేరేలా మారిపోయింది. మొత్తంగా మీడియా దృష్టి సారావైపు వెళ్లిపోయింది. ఆమె తొలి సినిమా కావడంతో అందరూ ఆమె మీదే దృష్టి పెట్టారు. దాంతో తన కష్టానికి తగ్గ రెస్పాన్స్‌ రాలేదని సుశాంత్‌ బాధపడ్డాడు’ అని అభిషేక్‌ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు.

1

2

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus