నాని నటనకు ఫిదా అయిన జాబితాలో స్టార్ డైరక్టర్
- July 12, 2017 / 02:44 PM ISTByFilmy Focus
నాని తన నేచురల్ నటనతో అందరిని తన అభిమానులుగా మార్చుకుంటున్నారు. యువతీయువకులకు ఇష్టమైన ప్రేమకథలతో సినిమాలు చేస్తూ, వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న అతను రీసెంట్ గా నిన్నుకోరి సినిమాతో మరో సక్సస్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు. ఈ మూవీ నానికి కలక్షన్స్ మాత్రమే కాదు ప్రశంసలను తెచ్చి పెడుతున్నాయి. “నాని నువ్వు ఒక విజయాల మిషన్ లా తయారవుతున్నావు.. నీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి” అంటూ అఖిల్ అక్కినేని ప్రశంసించగా, నిన్నుకోరి మనసును టచ్ చేసిందంటూ రకుల్ ప్రీత్ సింగ్ మెచ్చుకుంది. సినీతారలు కాదు రాజకీయనాయకులుకూడా నానిని అభినందించక ఉండలేకపోతున్నారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్నుకోరి సినిమాని చూసి “నేటి తరం హీరోలో ఉత్తమ నటుడిగా నాని నిరూపించుకుంటున్నారు” అని అన్నారు. తాజాగా హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ నానిపై ప్రశంసల జల్లు కురిపించారు. ” నిన్నుకోరి సినిమా చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను. నాని ఎమోషన్, ఫన్ అన్నింటినీ బాగా పండించాడు” అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు హీరోయిన్ గా నటించిన నివేత థామస్ కోసం కొత్త పాత్రలు పుట్టుకొస్తాయని రాశారు. కొరటాల ట్వీట్ కి నాని, నివేత వెంటనే స్పందించారు. కృతజ్ఞతలు తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















