ఇండస్ట్రీలో విషాదం… సీనియర్‌ దర్శకనిర్మాత కన్నుమూత!

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్‌ దర్శకుడు కమ్‌ నిర్మాత అయిన కుమార్‌ సహానీ (83) ఇటీవల కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని కోల్‌కతా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. పాకిస్థాన్‌లోని లర్కానా పట్టణంలో జన్మించిన ఆయన బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ఆయన సినిమాలు విమర్శకుల ప్రశంసలతోపాటు ఉత్తమ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కూడా అందుకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

కుమార్‌ సహానీ సినిమాల జాబితా చూస్తే ‘తరంగ్‌’, ‘ఖయాల్‌ గాథా’, ‘మాయా దర్పణ్‌’, ‘కస్బా’, ‘ఛార్‌ అధ్యాయ్‌’ లాంటివి కనిపిస్తాయి. ఆయన సినిమాలు చూస్తే ఎక్కువగా రాజకీయ నేపథ్యంలో ఉంటాయి. అలాంటి సినిమాల్ని ఆయన తనదైన శైలితో రూపొందించేవారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. కుమార్‌ సహానీ పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందారు. 1972లో ‘మాయా దర్పణ్‌’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించారు.

నిర్మల్‌ వర్మ రాసిన కథ ఆధారంగా ‘మాయా దర్పణ్‌’ సినిమా వచ్చింది. ఆ తర్వాత 1984లో (Kumar Sahani) కుమార్‌ సహానీ తెరకెక్కించిన ‘తరంగల్‌’ సినిమాకు జాతీయ పురస్కారం దక్కింది. ఆయ సినిమాల్లో మిఠా వశిష్ఠ్‌ ఎక్కువగా నటించారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus