కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు రాజకీయ నాయకుడు విజయ్ కాంత్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇలా అనారోగ్య సమస్యలకు తోడు కరోనా కూడా రావడంతో ఈయనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇలా వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ ఈయన పరిస్థితి విషమంగా మారడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇక విజయకాంత్ మరణించడంతో తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఎంతో విషాదం నెలకుంది. దీంతో ఎంతో మంది సెలెబ్రెటీలు ఈయన మరణం పై స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రేమమ్ సినిమా ద్వారా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్ఫోన్స్ పుత్రేన్ విజయ్ కాంత్ మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ కాంత్ గారిది సహజ మరణం కాదని ఆయనని హత్య చేశారు అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు నటుడు మంత్రి ఉదయ్ నిది స్టాలిన్ ని ట్యాగ్ చేస్తూ.. ఉదయ్ నిది అన్న విజయ్ కాంత్ గారిది సహజ మరణం కాదు ఆయనని ఎవరో హత్య చేశారు. ఆ హంతకులు ఎవరో కనిపెట్టండి అంటూ కామెంట్స్ చేశారు. గతంలో కూడా కరుణానిధి జయలలిత గారిని కూడా ఎవరో హత్య చేశారు అంటూ నేను మీకు చెప్పాను ఇక ఈరోజు కూడా (Vijayakanth) విజయ్ కాంత్ గారిది సహజమరణం కాదని తెలిపారు.
అంతేకాకుండా ఇప్పుడు ఈ హంతకులను కనిపెట్టకపోతే ఇండియన్ 2 సెట్స్ లో కమల్ హాసన్ గారిని ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని కూడా హత్య చేస్తారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విధంగా విజయ్ కాంత్ మరణం గురించి డైరెక్టర్ పుత్రేన్ ఈ సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పుత్రెన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి మరి ఈయన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!