Nayanthara: ఎంజీఆర్‌ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి?

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి కొంతకాలం ఆయనతో రిలేషన్ లో ఉంది. ఇటీవల పెద్దల అంగీకారంతో నయన్, విఘ్నేష్ ముడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 9 వ తేదీన మహాబలిపురంలో సినీ ప్రముఖులు, బంధు మిత్రుల ఆధ్వర్యంలో నయనతార , విఘ్నేష్ వివాహం చాల ఘనంగా జరిగింది. పెళ్ళి తర్వాత వీరిద్దరూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తమ మొక్కులను తీర్చుకుంటున్నారు

ఇటీవల ఈ జంట కొచ్చిన్ లో ఉన్న నయనతార తల్లి తండ్రులను కలవటానికి వెళ్లారు. అనారోగ్యం కారణంగా నయనతార తల్లిదండ్రులు ఆమె పెళ్లికి హాజరు కాలేకపోయారు. అందువల్ల వీరిద్దరూ నయనతార తల్లిదండ్రుల సమక్షంలో మరొకసారి వివాహం చేసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా నయనతార పెళ్లి గురించి ప్రముఖ తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్ చేశాడు. ఎంతో ఘనంగా నయనతార-విఘ్నేష్ తమ పెళ్లి వేడుకను రూ.25 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కు అమ్మినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి తమిళ దర్శకుడు వేలు ప్రభాకరన్‌ సంచలన వాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చంశనీయంగా మారాయి. ఒక సినిమా వేడుకలో పాల్గొన్న వేలు ప్రభాకరన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కాలంలో చిన్న చిన్న నటులు కూడా విలాసవంతమైన జీవితాలకు బాగా అలవాటుపడ్డారు. తమ విలాసాలను ప్రజలకి చూపించుకోవడానికి సోషల్ మీడియాని బాగా వాడుకుంటున్నారు. అంతేకాకుండా తమ విలసాలను చూపించుకోవడానికి బాగా ఖర్చు పెట్టి వివాహాలు చేసుకొని అధిక మొత్తానికి అమ్ముకుంటారంటూ నయనతార వివాహాం గురించి మాట్లాడాడు.

నయనతార తన వివాహా వేడుకను కొన్ని కోట్లకు అమ్ముకుంది. ఆమెకి ఆ హక్కు ఉంది. కానీ ఆ పెళ్ళి వేడుకను ప్రసారం చేసి ప్రేక్షకులు వద్ద నుంచి రూ.500 కోట్లు సంపాదిస్తాడు. ఇలాంటి వారు ప్రముఖ నటుడు ఎంజీఆర్‌ను చూసి నేర్చుకోవాలని చెప్పుకొచ్చాడు. ఎంజీఆర్‌ కుటుంబ సభ్యుల వివాహాలు ఘనంగా జరపడానికి అసలు ఇష్టపడేవారు కాదు అంటూ ఆయన నయనతార డబ్బు కోసమే పెళ్లిని అమ్ముకుంది అంటూ ఈమె పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus