రిపోర్టర్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన స్టార్ డైరెక్టర్

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ చిత్రం ఇటీవల అంటే దీపావళి కానుకగా నవంబర్ 10న తమిళ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. రాఘవ లారెన్స్- ఎస్.జె.సూర్య.. కాంబినేషన్లో రూపొందిన మూవీ ఇది. అక్కడి స్టార్ డైరెక్టర్ కార్తీ సుబ్బరాజు దర్శకుడు. తెలుగులో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ బాగానే ఉన్నా.. ట్రాజెడీతో కూడిన క్లైమాక్స్ ని ఇక్కడి జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అయితే తమిళంలో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ను సాధించింది.

‘జపాన్’ ఫ్లాప్ అవ్వడం కూడా ఈ సినిమాకి కలిసొచ్చినట్టు అయ్యింది. దీంతో అక్కడ చిత్రబృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి కార్తీక్ సుబ్బరాజ్ కి కోపం వచ్చింది. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో లారెన్స్ సరసన నిమిషా సజయన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమెది గిరిజన యువతి పాత్ర, అలాగే నిండు గర్భిణీగా సినిమా అంతా కనిపిస్తుంది. తన వరకు చాలా బాగా నటించింది.

అంతకు ముందు వచ్చిన సిద్దార్థ్ ‘చిన్నా’ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా చేసింది. అయితే ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ థాంక్స్ మీట్ లో ఓ రిపోర్టర్ ‘ఏం అందంగా ఉందని ఇలాంటి అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు’ అన్నట్టు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ను ప్రశ్నించాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ కి కోపం వచ్చేసింది. ‘ఆమె అందంగానే ఉంది కదా?’ అని ఎదురు ప్రశ్నిస్తూనే ఆ రిపోర్టర్ కి క్లాస్ పీకాడు (Karthik Subbaraj) కార్తీక్ సుబ్బరాజు.

“బహుశా ఆమె అందంగా లేదు అనేది మీ ఆలోచనా విధానం కావొచ్చు. ఎవరైనా.. అందంగా లేరని మీరు ఎలా చెప్తారు? అది చాలా తప్పుడు ఆలోచన. అలా కామెంట్ చేయడం అనేది దాదాపు శారీరక వేధింపులతో సమానం. దానికి కఠినమైన శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus