Sukumar: భార్య కోసం ఆ పని చేసిన క్రియేటివ్ డైరెక్టర్..?

ఒకవైపు దర్శకునిగా విజయాలను అందుకుంటున్న సుకుమార్ మరోవైపు తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ శిష్యులకు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కేలా చేస్తున్నారు. తన శిష్యుల సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ సుకుమార్ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఇతర దర్శకులతో పోలిస్తే సుకుమార్ సినిమాలో కథ, కథనాలు భిన్నంగా ఉంటాయి. దర్శకుడు రాజమౌళి సైతం సుకుమార్ ప్రతిభాపాటవాలను మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సుకుమార్ సతీమణి తబిత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

నేడు సుకుమార్ తబితల వివాహ మహోత్సవం కావడంతో సుకుమార్ తనపై ప్రేమతో రాసిన కవితను తబిత సుకుమార్ అభిమానులతో పంచుకున్నారు. “నేను ఎప్పుడూ సగాన్ని.. నువ్వు రాకముందు పూర్తి కాని సగాన్ని.. నువ్వు వచ్చాక పూర్తైన సగాన్ని.. నేను పూర్తి కావడం అంటే నీ సగం అవ్వడమే కదా.. నా సగానికి ప్రేమతో మ్యారేజ్ డే విషెస్” అని సుకుమార్ కవిత రాశారు. సుకుమార్ రాసిన కవిత నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆ కవితను ప్రశంసిస్తున్నారు.

తబితతో పాటు నెటిజన్లు సైతం సుకుమార్ రాసిన కవిత ఎంతో బాగుందని కామెంట్లు చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప సుకుమార్ బన్నీ కెరీర్ లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus