Pawan Kalyan: హరి హర వీరమల్లు నుండి క్రిష్ తప్పుకోవడానికి కారణం పవనేనా?

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎప్పుడో వకీల్ సాబ్ సినిమా షూటింగ్ సమయం లో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. మధ్యలో కరోనా లాక్ డౌన్ ఈ చిత్రం ఆలస్యం అవ్వడానికి కారణం అయితే, పవన్ కళ్యాణ్ వేరే సినిమాల షూటింగ్స్ కి కమిట్ అయ్యి వాటికే ముందు ప్రాముఖ్యత ఇవ్వడం మరో కారణం.

కరోనా లాక్ డౌన్ ఎత్తివేయగానే పవన్ కళ్యాణ్ డేట్స్ మొత్తాన్ని భీమ్లా నాయక్ సినిమా కోసం ఇచ్చేసాడు. ఈ సినిమా తర్వాత చాలా కాలం షూటింగ్స్ కి విరామం ఇచ్చి ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.సుమారుగా రెండు నెలల పాటు విరామం లేకుండా ఇంటర్వెల్ సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన ‘బ్రో’ మూవీ షూటింగ్ లో పాల్గొని ఆ సినిమాని పూర్తి చేసాడు.

ఆ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ ని ప్రారంభించి మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసాడు. ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే OG మూవీ షూటింగ్ కి డేట్స్ ఇచ్చేసాడు. సుమారుగా నెల రోజుల వరకు సాగిన ఈ షెడ్యూల్ తర్వాత ఇక మే నెల మొత్తాన్ని ‘హరి హర వీరమల్లు’ కి ఇస్తాడని సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది. ఫ్యాన్స్ కూడా నిజమే అనుకున్నారు. కానీ ఈరోజు నుండి మళ్ళీ ఆయన హైదరాబాద్ లో కొత్తగా జరుగుతున్న షెడ్యూల్ కి డేట్స్ ఇచ్చేసాడు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ కేటాయించబోతున్నాడట.

ఇదంతా గమనించిన డైరెక్టర్ క్రిష్ తీవ్రమైన అసహనం కి గురై వేరే ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడట.బాలీవుడ్ లో ఒక క్రేజీ స్టార్ హీరోతో రీసెంట్ గా చర్చలు కూడా పూర్తి అయ్యినట్టు సమాచారం.మరి క్లైమాక్స్ భాగం తప్ప షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసి వేరే ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవుతాడా, లేదా ముందుగానే ఆ ప్రాజెక్ట్ కి వెళ్లిపోనున్నాడా అనేది తెలియాల్సి ఉంది. వచ్చే నెల లో (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోతే ఇక వేరే సినిమాకే డేట్స్ ఇవ్వడానికి సిద్ధం అయ్యాడట క్రిష్.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus