సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. ప్రముఖ నటీనటులు , దర్శకులు, నిర్మాతలు లేదా టెక్నీషియన్లు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉండటం ఆందోళన కలిగించే విషాదం. ఈ మధ్యనే ఓ ప్రముఖ సింగర్, అలాగే యాంకర్ కూడా ఘోర ప్రమాదాలకు గురయ్యి మరణించిన సందర్భాలు చూశాం. ఇక రెండు రోజుల క్రితం గద్దర్ మరణించారు. ఆయన మరణవార్త ఒక్కసారిగా సినీ పరిశ్రమని కుదిపేసింది అని చెప్పాలి.
ఆ విషాదం నుండి కోలుకోకుండానే తమిళ నటి సింధు క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే.అలాగే కన్నడ నటుడు విజయ్ భార్య కూడా చిన్నవయసులోనే గుండెపోటుతో మరణించడం మనం చూశాం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ , ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఫ్రిడ్ కిన్.. లాస్ ఏంజెల్స్ లో మరణించారు. ఆయన వయసు 87 ఏళ్ళు కావడం గమనార్హం. ది ఫ్రెంచ్ కనెక్షన్ , ది ఎక్సార్సిస్ట్, చిత్రాలతో ఈయన ఎంతో ఖ్యాతిని దక్కించుకున్నారు.
వాటికి అకాడమీ అవార్డులు లభించాయి. హార్రర్, థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు ఈయన. అందులో ఫ్రిడ్ కిన్ స్పెషలిస్ట్ అని చెప్పాలి. ఎలాంటి సినిమాలు తీసిన తన మార్క్ మిస్ అవ్వకుండా చూసుకునేవారు. వయసు సంబంధిత సమస్యలతోనే ఈయన మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఏదేమైనా ఫ్రిడ్ కిన్ మరణవార్త సినీ పరిశ్రమకి తీరని లోటు అనే చెప్పాలి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!