దేశమంతా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న వేళ …. సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. నిన్నటికి నిన్న నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో.. ఏకంగా 70 మంది దుర్మరణం చెందారు. ఇందులో 68 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.అంతేకాకుండా 53 మంది నెపాలీలు, 5 మంది భారతీయులు ఇంకా పలు దేశాలకు చెందిన వారు ఈ ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నేపాల్ కు చెందిన ప్రముఖ జానపద గాయని నీరా చంత్యాల్ కూడా ఉండటం హాట్ టాపిక్ అయ్యింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఓ ఈవెంట్ కోసం ఫొఖారా అనే ప్రదేశానికి వెళ్తున్న టైంలో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటిలో ఈవెంట్ చేయాల్సిన ప్రదేశానికి చేరుకుంటాము అనుకున్న గాయిని నీరా చంత్యాల్.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టిందట.
అంతలోనే ఆమె ఇలా అయిపోతుంది అని ఎవ్వరూ అనుకోలేదు.ఇక నీరా చంత్యాల్ మృతి చెందినట్లు ఆమె సోదరి హీరా చంత్యాల్ షెర్చన్ ధృవీకరించింది. ఇక నీరా చంత్యాల్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఆమె మరణానికి చింతిస్తూ.. తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఆమె అభిమానులు అయితే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదంటూ కామెంట్లు పెడుతున్నారు.