అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎందుకు అంటే బన్నీ షేర్ చేసే క్యూట్ వీడియోస్ ద్వారా అర్హ అందరికి సుపరిచితమే. అంతే కాకుండా గుణశేఖర్ డైరెక్షన్లో సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం మూవీ లో బాలనటిగా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది ఈ చిన్నారి. ఆ తరువాత చదువుపై శ్రద్ధ పెట్టగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అయితే చెస్ విషయంలో ఎప్పటికప్పుడు వార్తాల్లో ఉంటుంది అర్హ.
ఇంతకు ముందే వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్ అవార్డు గెలుచుకుంది అర్హ. నాలుగున్నర సంవత్సరాల వయసులోనే గేమ్ ఆడటమే కాక తన కంటే పెద్దవారికి చెస్ ట్రైనింగ్ ఇచ్చింది ఈ చిన్నారి. అర్హ 30కి పైగా పజిల్స్ పూర్తి చేయటమే కాక, సుమారుగా 50 మందికి శిక్షణ అందించటంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో చోటు గెలుచుకుంది. దీంతో తండ్రికి తగ్గ కూతురు అని అభిమానులు అర్హ పాపను ప్రశంసిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి ఘనత మంచు లక్ష్మి కూతురు నిర్వాణ సాదించింది.

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అర్హ , అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీలో ఒక పాత్రలో కనిపించనుందని టాక్. అయితే ఈ వార్తలపై ఎక్కడ కూడా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
