ఇండియన్ సినిమాలో భారతాన్ని సినిమాగా తెరకెక్కించాలని ప్రస్తుతం చాలామంది డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నారు. రెండు, మూడు పార్టులు అయినా ఫర్వాలేదు మహా భారతం సినిమాగా రావాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. అలంటి వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఒకరు. చాలా ఏళ్లుగా ఆయన ‘సినిమాగా భారతం’ అనే మాట చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. దీంతో ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Aamir Khan
‘లాపతా లేడీస్’ (Laapataa Ladies) ఆస్కార్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్ ఖాన్ ఇటీవల మీడియా ముందుకు తరచుగా వస్తూనే ఉన్నాడు. అలా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడుతూ.. మహాభారతం తన కలల ప్రాజెక్ట్ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఆ సినిమా విషయంలో తనపై ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయని.. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆ సినిమా తెరకెక్కించాలని అకుంటున్నానని కూడా చెప్పారు. డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో బాధ్యతతోపాటు భయమూ ఉంది.
ఎలాంటి తప్పు లేకుండా భారీ స్థాయిలో సినిమాలను రూపొందించాలని అనుకుంటున్నాను. ఈ కథ భారతీయుల రక్తంలో ఉంది. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నా అని తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు ఆమిర్ ఖాన్. ఇక ఈ సినిమా గురించి గతంలో వచ్చిన రూమర్స్ ప్రకారం చూస్తే రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు.
కానీ ప్రస్తుతం ఉన్న ధరలు మార్కెట్ ప్రకారం చూస్తే కనీసంలో కనీసం రూ. 2000 కోట్లు పెడతారని, మూడు పార్టులు ఉంటాయి అని చెబుతున్నారు. ఇక ఆయన కెరీర్ గురించి చూస్తే.. 2022లో ‘లాల్ సింగ్ చడ్డా’తో (Laal Singh Chaddha) వచ్చారు. ఆ సినిమా ఇబ్బందికర ఫలితం తెచ్చి పెట్టింది. ఇప్పుడు రజనీకాంత్ (Rajinikanth) ‘కూలి’లో (Coolie) నటిస్తున్నాడు ఆమిర్. ఇది కాకుండా మరో సౌత్ సినిమాను ఓకే చేశాడు అని వార్తలొచ్చాయి. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. హిందీలో చేసిన ‘సితారే జమీన్ పర్’ ఎలానూ ఉంది.