ఆగస్టు 15 ని టార్గెట్ చేసి.. కొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) తో పాటు ‘తంగలాన్’ (Thangalaan) కూడా రిలీజ్ కాబోతోంది. అలాగే ’35’ (35 Chinna Katha Kaadu) ‘ఆయ్’ (AAY) వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో ‘ఆయ్’ సినిమా ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో రూపొందింది. ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) హీరోగా నటించాడు. టీజర్, ట్రైలర్స్, రెండు పాటలు బాగున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ప్రేక్షకుల్ని నవ్వించింది.
గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ముగ్గురు స్నేహితుల కథ ఇది. స్నేహితుల మధ్య సాగే కామెడీ సినిమాలకి డిమాండ్ ఎక్కువ. కాబట్టి.. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించే అవకాశాలు ఎక్కువే..! ఇన్సైడ్ టాక్ కూడా.. ‘ఆయ్’ గురించి గొప్పగానే చెబుతున్నారు. లాజిక్స్ ఏమీ పట్టించుకోకుండా ఓ 2 గంటల పాటు హ్యాపీగా నవ్వుకునే సినిమా ఇది అని అంటున్నారు. సో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడే ఛాన్సులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. అదేంటంటే.. ‘ఆయ్’ లో హీరోగా ముందు పూరి జగన్నాథ్ Puri Jagannadh) కొడుకు ఆకాష్ పూరీని (Akash Puri) అనుకున్నారట. కానీ అతను ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ని సంప్రదించగా.. అతను ఓకే చేసేసాడట. ఏదేమైనా.. ఆకాష్ హీరోగా మారి 3 సినిమాల వరకు చేశాడు. కానీ ఏదీ కూడా సక్సెస్ కాలేదు. ‘ఆయ్’ కనుక హిట్ అయితే అతను గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే.