Allu Arjun: బన్నీ మరో షాక్ ఇవ్వబోతున్నారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 మూవీ షూటింగ్ 90 శాతం పూర్తవగా ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఐకాన్ సినిమాలో నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాలతో పాటు ఒక కోలీవుడ్ హిట్ సినిమాపై కన్నేశారని తెలుస్తోంది. ఒక యంగ్ డైరెక్టర్ ఈ సినిమా స్క్రిప్ట్ పనులపై దృష్టి పెట్టారని సమాచారం.

కోలీవుడ్ లో హిట్టైన ఈ సినిమా రీమేక్ హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమా హక్కుల కోసం గీతా ఆర్ట్స్ భారీ మొత్తం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ సినిమా హక్కులను కొనుగోలు చేశారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. బన్నీ అల వైకుంఠపురములో సినిమా తరువాత ఎంపిక చేసుకునే ప్రాజెక్టుల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ఎవరనే సంగతి తెలియల్సి ఉంది.

అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా రేంజ్ ఉన్న కథలపై దృష్టి పెట్టారని సమాచారం. అల్లు అర్జున్ లేదా గీతా ఆర్ట్స్ ఈ సినిమాకు సంబంధించి స్పష్టతనివ్వాల్సి ఉంది. అల్లు అర్జున్ ఇప్పటికే నటిస్తున్న ప్రాజెక్టులకు మరో ప్రాజెక్టును యాడ్ చేస్తూ అభిమానులకు షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఏ డైరెక్టర్ సినిమా ముందు మొదలవుతుందో ఏ డైరెక్టర్ సినిమా తరువాత మొదలవుతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus