ఒకప్పుడు బోల్డ్ సీన్స్ అంటే షూట్ చేయడానికి దర్శకనిర్మాతలు.. అందులో నటించడానికి నటీనటులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ కాలం మారింది. ఓటీటీలు వంటివి కూడా వచ్చాక అలాంటి సన్నివేశాలు సర్వసాధారణం అయిపోయాయి. కాకపోతే ఆ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో కూడా టెక్నికల్ గా అంతా కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి ఇబ్బందులే ఓ జంటకి ఎదురయ్యాయి. విషయంలోకి వెళితే..దివంగత ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్ అందరికీ సుపరిచితమే.
తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్ మెన్లను కన్ఫ్యూజ్ చేసి దడ పుట్టించేవాడు. షేన్ వార్న్ టెస్టుల్లో, వన్డేల్లో వందకు పైగా వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇతను వివాదాల్లో కూడా ఇరుక్కుంటూ వార్తల్లో నిలిచేవాడు. మ్యాచ్ కు ముందు వెనుక అమ్మాయిలతో ఓ రేంజ్లో సరసాలు ఆడటం ఇతనికి అలవాటు. ఇటీవల వచ్చిన వివాదాల వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ లో ఓ క్రికెటర్ స్టార్ హోటల్లో ఓ అమ్మాయితో పడక సుఖాన్ని అనుభవించే సన్నివేశం ఉంటుంది.
దానికి దగ్గరగా ఉండేది షేన్ వార్న్ జీవితం. అందుకే అతను ఎక్కువగా వివాదాల్లో నిలిచేవాడు. ఇక ఇతని జీవితాన్ని ఆధారం చేసుకుని ‘వార్ని’ అనే హాలీవుడ్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో షేన్ వార్న్ గా అలెక్స్ విలియమ్స్ , షేన్ వార్న్ సతీమణి సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తున్నారు. వీరి మధ్య ఓ బెడ్ రూమ్ సీన్ చిత్రీకరించాల్సి ఉంది.
బయట నుండి నడుచుకుంటూ వస్తూ.. వెళ్లి బెడ్ పై పడాల్సి ఉందట. కానీ బ్యాలన్స్ తప్పి ఇద్దరూ కింద పడ్డారు. దీంతో అలెక్స్ విలియమ్స్ తలకి గాయమయ్యిందట. కెన్నడీ మణికట్టుకి కూడా బలమైన గాయమయ్యిందట. ఈ విషయాన్ని కెన్నడీ చెప్పుకొచ్చింది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్