Star Hero: పెళ్లి కాకుండానే ఆ నటుడికి రెండో బిడ్డనివ్వబోతున్న హీరోయిన్!

ప్రేమ, పెళ్లి , బ్రేకప్ వంటి వ్యవహారాలు ఇప్పుడు అన్ని చోట్లా సర్వసాధారణం అయిపోయాయి. సినీ పరిశ్రమలో అయితే పెళ్లికాకుండానే సహజీవనం చేస్తూ పిల్లలను కనే బ్యాచ్ ఎక్కువ కనిపిస్తుంది. అలాంటి వారిలో అర్జున్ రాంపాల్ ఒకడు. బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ చిత్రంతో ఇతను టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘హరి హర వీర మల్లు’ సినిమాలో కూడా ఇతను ఓ కీలక పాత్రకి ఎంపికయ్యాడు.

కానీ ‘భగవంత్ కేసరి’ ముందు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. అదే తెలుగులో ఇతనికి మొదటి సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. అర్జున్‌ రాంపాల్‌ తన భార్య మెహర్‌ జెసియాకు విడాకులిచ్చి సెపరేట్ అయిపోయి.. 2019 నుండి నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ తో సహజీవనం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరికీ ఆల్రెడీ ఓ బాబు జన్మించాడు. అతనికి అరిక్‌ అని నామకరణం కూడా చేసారు.

ఇప్పుడు గాబ్రియెల్లా మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమెను ఇంకా (Star Hero) అర్జున్ రాంపాల్ పెళ్లి చేసుకోలేదు. అయినా రెండోసారి బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అయిపోయింది. ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. ఇక గాబ్రియెల్లా తెలుగులో నాగార్జున – కార్తీ కాంబినేషన్లో రూపొందిన ‘ఊపిరి’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus