బాబి డియోల్ పేరు ఇప్పుడు బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. ‘యానిమల్’ (Animal) హిట్ తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ఆయన, సౌత్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నారు. కానీ ఈ విజయానికి వెనుకన ఉన్న కథ సగటు ప్రేక్షకుడికి తెలియదు. సినీ పరిశ్రమలో బాబి డియోల్ (Bobby Deol ) అనుభవం దాదాపు నాలుగు దశాబ్దాలది. 1977లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టినా, ఆయన ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో పలు మంచి అవకాశాలు దక్కినా, పలు సినిమాలు మాత్రం ఆయనను నిరాశపరిచాయి.
Sandeep Reddy Vanga
వరుస డిజాస్టర్స్ అనంతరం ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు ఎదుర్కోవడం, అవకాశాలు లేకపోవడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతో కలిచివేసింది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఖాళీగా ఉండడంతో భార్య సంపాదనపైన ఆధారపడాల్సి వచ్చిందట. ఇక అవకాశాలు రావనే ఆలోచనలు కూడా వచ్చాయట. ఈ క్రమంలోనే బాబి డియోల్ జీవితంలో కీలక మలుపు తీసుకొచ్చింది దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ‘యానిమల్’ సినిమాలో అబ్రార్ పాత్రకు సరైన వ్యక్తి కోసం వెతుకుతూ, బాబి పేరు సూచించిన సందీప్, ఆయనకు నూతన శక్తిని కలిగించారు.
మొదటగా ఈ అవకాశం రావడంతోనే బాబి జీవితంలో వెలుగులు పుట్టాయి. ఆయన నటనకు సరికొత్త రుచిని అందించిన ఈ చిత్రం ఆయనకు పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ విజయానికి దోహదం చేసిన సందీప్ పేరు చెబితే బాబి ఇప్పటికీ భావోద్వేగంతో నిండిపోతారట. కంటతడి పెట్టుకునేలా సందీప్ గురించి ఎమోషనల్ అవుతారట. ఆ విషయాన్నిఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ దర్శకుడు బాబీ తెలియజేశారు.
‘యానిమల్’ విజయంతో బాబి డియోల్ వరుస సినిమాలకి సైన్ చేశారు. ప్రస్తుతం ఆయన బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంతే కాకుండా హౌస్ ఫుల్-5 వంటి భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లోనూ బిజీగా ఉన్నారు. కొత్త సెకండ్ ఇన్నింగ్స్‌లో బాబి డియోల్ తాను ఎన్నో పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.