రూ.70 కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసిన హీరో!

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కొత్త ఇళ్ళు.. కొనుగోలు చేయడం లేదా నిర్మించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. నాగ చైతన్య ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. ఇంకా పలువురు బుల్లితెర సెలబ్రిటీలు కూడా ఫ్లాట్ లు వంటివి కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ముంబైలో ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మొన్నామధ్య సూర్య..

తమ కుటుంబం నుండి సెపరేట్ అయ్యి వేరు కాపురం పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. సూర్య వేరు కాపురం పెట్టిన మాట నిజమే కానీ అది గొడవలు వచ్చి కాదు అని అతని సన్నిహితులు తెలియజేస్తున్నారు. సూర్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అందుకే సూర్య దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇక సూర్య ముంబైలో సుమారు రూ. 70 కోట్లతో ఓ లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేసాడని తెలుస్తుంది.

రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ను తీసుకున్నాడు అని సమాచారం. అత్యంత విలాసవంతమైన ఈ ఫ్లాట్ లో భారీ గార్డెన్ స్పేస్, పార్కింగ్ స్పాట్ లు కూడా ఉన్నాయి. నిజానికి ఈ ఫ్లాట్ ధర వచ్చి రూ. 68 కోట్లు కాగా.. మిగతా 2 కోట్లు ఫ్లాట్ బుకింగ్, ఇతర ఖర్చులకు చెల్లించారని సమాచారం.

త్వరలోనే చెన్నై నుంచి సూర్య-జ్యోతికలు ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు టాక్ నడుస్తుంది.కానీ సూర్య షూటింగ్ ల నిమిత్తం ఎక్కువగా చెన్నైలోనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు అతను ఫ్యామిలీతో కలిసి ముంబైకి ఎలా షిఫ్ట్ అవుతాడు అనే విషయం పై కూడా చర్చలు మొదలయ్యాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus