గర్ల్ ఫ్రెండ్ ఇంటి సమీపంలో హీరో కొత్త ఇల్లు!

బాలీవుడ్ కపుల్స్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా జంట ఒకటి. ఈ జంట ప్రేమ గురించి నిత్యం బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియాలో ఈ జంట ఎప్పటికప్పుడు తమ ఫోటోలను షేర్ చేస్తూ తమ రిలేషన్ గురించి ఓపెన్ కామెంట్స్ చేస్తుంటారు. ఇద్దరు కలిసి పార్టీలకు, ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. లాక్ డౌన్ లో కూడా ఈ జంట కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అర్జున్ కపూర్ మలైకా ఇంటి సమీపంలో ఓ ఖరీదైన విల్లాను కొనుగోలు చేస్తినట్లు సమాచారం.

ముంబైలో బాంద్రా వెస్ట్ అనే ఏరియాలో బీచ్ ఫేసింగ్ తో ఉన్న ఓ స్కై విల్లాను అర్జున్ కొన్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాలుగు బెడ్ రూమ్ లు ఉండే ఈ విల్లా కోసం రూ.20 నుండి 23 కోట్ల వరకు ఖర్చు పెట్టాడట అర్జున్ కపూర్. ఈ కాస్ట్లీ విల్లా ఎంతో విలాసవంతంగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఏరియాలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ లాంటి స్టార్లకు కూడా విల్లాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. మలైకా-అర్జున్ రెండేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్న మలైకా తనకంటే వయసులో 12 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. మలైకాకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. కాబట్టి పర్సనల్ విషయాల గురించి ఎక్కువగా స్పందించాలనుకోవడం లేదని రీసెంట్ గా అర్జున్ కపూర్ మీడియాకు చెప్పాడు. మలైకా గతాన్ని గౌరవిస్తానని.. కానీ పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురావడం లేదని తెలిపాడు.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus